decreases: స్వల్పంగా తగ్గిన డీజిల్ ధరలు

ABN , First Publish Date - 2021-07-12T16:00:23+05:30 IST

దేశంలో ఒక వైపు పెట్రోల్ ధరలు పెరుగుతుండగా, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి...

decreases: స్వల్పంగా తగ్గిన డీజిల్ ధరలు

న్యూఢిల్లీ : దేశంలో ఒక వైపు పెట్రోల్ ధరలు పెరుగుతుండగా, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి.సోమవారం పెట్రోల్ ధర లీటరుకు 34 పైసలు పెరగ్గా, డీజిల్ ధర 15 పైసలు తగ్గింది. కోల్ కతా నగరంలో సోమవారం పెట్రోల్ లీటరు ధర 101.39రూపాయలకు పెరిగింది. డీజిల్ ధర లీటరుకు 15 పైసలు తగ్గి రూ.92.86 అయింది. దేశంలోని వివిధ నగరాలను బట్టి వేర్వేరుగా పెట్రోల్ ధర పెంపు 25 పైసల నుంచి 34 పైసలదాకా ఉంది. డీజిల్ లీటరుకు 15 పైసల నుంచి 17 పైసల దాకా తగ్గింది. ఢిల్లీలో సోమవారం పెట్రోల్ ధర 101.23 రూపాయలకు పెరిగింది. డీజిల్ మాత్రం తగ్గి 89.76 రూపాయలైంది.వివిధ రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే రాజస్థాన్ రాష్ట్రంలో దేశంలో అత్యధిక వ్యాట్ విధించడం వల్ల పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూకశ్మీర్, ఒడిశా, తమిళనాడు, కేరళ, బిహార్, పంజాబ్, లడఖ్, సిక్కిం, పుదుచ్చేరి, ఢిల్లీలలో పెట్రోలు ధర వందరూపాయల మార్కును దాటేసింది. పెట్రో ధరల పెంపుతో సామాన్యులపై భారం పడుతోంది.


Updated Date - 2021-07-12T16:00:23+05:30 IST