రాజస్థాన్‌లో పెట్రోల్ బంకులు బంద్!

ABN , First Publish Date - 2021-04-10T22:22:40+05:30 IST

ఇంధనంపై వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ...

రాజస్థాన్‌లో పెట్రోల్ బంకులు బంద్!

జైపూర్: ఇంధనంపై వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఇవాళ సమ్మె చేపట్టింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. సమ్మె కారణంగా రాష్ట్రంలోని 7 వేల బంకులు మూతపడ్డాయి. కేవలం ఆయిల్ కంపెనీల చేతుల్లోని బంకులు మాత్రమే పనిచేశాయి. సమ్మె సందర్భంగా డీజిల్, పెట్రోల్ అమ్మకాలను నిలిపివేశామని అసోసియేషన్ అధ్యక్షుడు సంగీత్ బగాయ్ పేర్కొన్నారు. ‘‘కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అధిక ఆదాయం కోసం వ్యాట్‌ను పెంచింది. ఇక్కడితో పోల్చితే ఇతర రాష్ట్రాల్లో ఇంధన ధరలు తక్కువగా ఉండడంతో అమ్మకాలు 34 శాతం తగ్గిపోయాయి...’’ అని సంగీత్ పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే అసోసియేషన్ తరపున ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చామనీ.. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని పెట్రోలియం డీలర్లు హెచ్చరించారు. 

Updated Date - 2021-04-10T22:22:40+05:30 IST