నేడు పెట్రోల్, డీజిల్ ధరలలో కాస్త ఉపశమనం

ABN , First Publish Date - 2021-07-18T14:28:06+05:30 IST

దేశీయ చమురు కంపెనీలు...

నేడు పెట్రోల్, డీజిల్ ధరలలో కాస్త ఉపశమనం

న్యూదిల్లీ: దేశీయ చమురు కంపెనీలు ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు తీసుకురాలేదు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కాగా శనివారం పెట్రోలు ధర లీటరుకు 30 పైసలు పెరగగా, డీజిల్ ధరలో మార్పులు చోటుచేసుకోలేదు. 


ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 101.84 గా ఉండగా, డీజిల్ ధర రూ. 89.87గా ఉంది. ముంబైలో పెట్రోలు లీటరు ధర రూ. 107.83గా ఉండగా, డీజిల్ ధర రూ. 97.45గా ఉంది. చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ.102.49గా ఉండగా, డీజిల్ ధర రూ.94.39గా ఉంది. కాగా పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యునికి మోయలేని భారంగా మారాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జమ్ముూకశ్మీర్, లధాఖ్‌లో లీటరు పెట్రోలు ధర వంద రూపాయలు దాటింది.

Updated Date - 2021-07-18T14:28:06+05:30 IST