వానల్లో మరింత జాగ్రత్తగా!

ABN , First Publish Date - 2020-07-27T08:35:35+05:30 IST

వానాకాలంలో ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటాం. అలానే ఈ సీజన్‌లో

వానల్లో మరింత జాగ్రత్తగా!

వానాకాలంలో ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటాం. అలానే ఈ సీజన్‌లో పెంపుడు జంతువుల ఆరోగ్యం, సంరక్షణ మీద కూడా దృష్టి పెట్టాలి. రెయినీ డేలోనూ పెట్స్‌ 


హుషారుగా ఉండేందుకు ఏం చేయాలంటే...

పొడిగా ఉండేలా: పెంపుడు  కుక్కలు, పిల్లులు వానలో తడవకుండా చూసుకోవాలి. వాటి పాదాలు తడిగా లేకుండా పొడి వస్త్రం లేదా బ్లాటింగ్‌ పేపర్‌తో తుడవాలి. తర్వాత యాంటీ ఫంగల్‌ పౌడర్‌ను రోజుకు ఒకసారి వాటి పాదాల కింద చల్లాలి.


హెయిర్‌కట్‌: ఈ సీజన్‌లో పెట్స్‌ జుత్తు ఎక్కువగా ఉంటే వానల్లో తడిస్తే దురద పుడుతుంది. తొందరగా ఆరదు కూడా! కాబట్టి వాటి జుత్తు చిన్నగా కత్తిరించాలి. ముఖ్యంగా పాదాల మధ్య వెంట్రుకలను కత్తిరించాలి. అలానే కాలి గోళ్లను కూడా చిన్నగా కట్‌ చేయాలి. 


క్రిమి, కీటకాలకు దూరంగా: వర్షాకాలంలో రకరకాల క్రిమి కీటకాలు పెట్స్‌ను ఇబ్బందికి గురిచేస్తాయి. అందుచేత పెట్స్‌ ఒంటి మీద, చెవులు, పాదాల దగ్గర ఇన్‌ఫెక్షన్లు ఉన్నాయేమో గమనించాలి. క్రిములు ఉంటే వెంటనే తొలగించాలి. అలానే వాటి జుత్తును స్పెషల్‌ షాంపూతో శుభ్రం చేయాలి. వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించి యాంటీ-టిక్‌ ఆయింట్‌ మెంట్‌ తీసుకోవాలి. 


వాక్‌కు తీసుకెళ్లడం: వర్షాల వల్ల మీ పెంపుడు కుక్కను సాయంత్రం నడకకు తీసుకెళ్లడం మానేసి ఉంటారు. ఎండ ఉన్నప్పుడు కొద్దిసేపు మీ పెట్‌ను ఆరుబయటకు తీసుకెళ్లండి. అకస్మాత్తుగా వర్షం వస్తే తడవకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా వాటికి డాగీ రెయిన్‌కోట్‌ వేయండి.


Updated Date - 2020-07-27T08:35:35+05:30 IST