Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమెరికాలో 12-15 ఏళ్ల పిల్లలకూ ఫైజర్‌ టీకా

వాషింగ్ట‌న్‌: పన్నెండేళ్ల నుంచి పదిహేనేళ్లలోపు పిల్లలకు ఫైజర్‌ కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) పచ్చజెండా ఊపింది. ఎఫ్‌డీఏకు చెందిన వ్యాక్సిన్‌ సలహా కమిటీ దీనికి సంబంధించి బుధవారం ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ వెంటనే గురువారం నుంచి పిల్లలకు ఫైజర్‌ టీకాలు అందించే ప్రక్రియ ప్రారంభం కానుంది. 12-15 ఏళ్లలోపు 2వేల మంది వలంటీర్లపై నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో ఈ వ్యాక్సిన్‌ సురక్షితమైంది, ప్రభావవంతమైందని తేలిన విషయాన్ని ఈసందర్భంగా ఎఫ్‌డీఏ గుర్తుచేసింది. కాగా, ప్రపంచంలోనే తొలిసారిగా కెనడాలో పిల్లలకు ఫైజర్‌ టీకా అందించే ప్రక్రియ ప్రారంభమైంది.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement