యూపీలో COVID మహమ్మారి దశ ముగిసింది...

ABN , First Publish Date - 2021-10-25T13:58:49+05:30 IST

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి దశ దాదాపుగా ముగిసిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు...

యూపీలో COVID మహమ్మారి దశ ముగిసింది...

సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు

గోరఖ్‌పూర్: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి దశ దాదాపుగా ముగిసిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.గోరఖ్‌పూర్ నగరంలో వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం యోగి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 12.6 కోట్లకు పైగా వ్యాక్సినేషన్లు, 8.24 కోట్లకు పైగా కొవిడ్ పరీక్షలతో యూపీ రాష్ట్రం రికార్డు సృష్టించిందని సీఎం చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1.8 లక్షల పడకలు సిద్ధంగా ఉన్నాయని, ఉత్తర ప్రదేశ్ ఏ విధంగానూ బలహీనంగా లేదని యోగి చెప్పారు.యూపీలో ఉమ్మడి కృషితో కొవిడ్ మహమ్మారి దశ దాదాపుగా ముగిసిందని సీఎం చెప్పారు.


 గత నాలుగున్నరేళ్ల బీజేపీ పాలనలో యూపీ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకువచ్చి పథకాలు అమలు చేశామని సీఎం యోగి చెప్పారు.‘‘ఇంతకు ముందు ప్రజలు గోరఖ్‌పూర్‌కి రావాలంటే భయపడేవారు, కానీ ఇప్పుడు అది అభివృద్ధికి ఉదాహరణగా మారింది. వచ్చే నెలలో ఎరువుల కర్మాగారం, ఎయిమ్స్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు.’’ అని యోగి చెప్పారు.38.32 కోట్లతో నిర్మించిన మల్టీ లెవల్ పార్కింగ్ స్థలాన్ని ఆదిత్యనాథ్ ప్రారంభించారు. దాదాపు రూ.142 కోట్ల విలువైన 358 అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు.

Updated Date - 2021-10-25T13:58:49+05:30 IST