Abn logo
Aug 2 2021 @ 00:13AM

పీహెచ్‌సీ భవన నిర్మాణ పనుల పరిశీలన

మార్కాపురం (వన్‌టౌన్‌), ఆగస్టు 1 : స్థానిక ఆర్డీవో కార్యాలయ ఆవరణలో సుమారు రూ.80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులు వైస్‌ చైర్మన్‌ షేక్‌ ఇస్మాయిల్‌, మున్సిపల్‌  కమిషనర్‌ నయీంఅహ్మద్‌ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ ఆరోగ్య కేంద్రం పూర్తి అయితే పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. డీఈ షేక్‌ సుభానీ పాల్గొన్నారు.