డాక్టర్లే లేని పీహెచసీ

ABN , First Publish Date - 2022-01-28T05:26:35+05:30 IST

స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేదలకు వై ద్యం దయనీయమైంది. కరోనాతో పాటు ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులతో మండ లవ్యాప్తంగా జనం విలవిలలాడుతున్నారు.

డాక్టర్లే లేని పీహెచసీ
వైద్యులు, రోగులు లేక వెలవెలబోతున్న ఆసుపత్రి

కరోనాతో ఒకరు.. డిప్యుటేషనపై మరో డాక్టర్‌ బదిలీ

పేదలకు అందని సర్కారు వైద్యం


కూడేరు, జనవరి 27: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేదలకు వై ద్యం దయనీయమైంది. కరోనాతో పాటు ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులతో మండ లవ్యాప్తంగా జనం విలవిలలాడుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. మండలకేంద్రంలోని పాథమిక ఆరోగ్యకేంద్రానికి వైద్యం కోసం వస్తే... ఇక్కడ డాక్టర్లే కానరారు. దీంతో విధిలేక ప్రైవేట్‌ క్లీనిక్‌లకు పరుగులుతీయాల్సి వస్తోంది. ఆరోగ్య కేంద్రంలోని ఒక డాక్టర్‌ కరోనా బారినపడ్డారు. మరొకరు డిప్యుటేషనపై వెళ్లిపోయారు. దీంతో డాక్టర్లు లేని పీహెచసీ వెలవెలబోతోంది. రోగులకు సర్కారు వైద్యసేవలు అందకుండా పోతున్నాయి. 24 గంటలు ఆసుపత్రిగా సేవలందించాల్సిన చోట డాక్టర్లు లేకపోవడంతో రోగులు మండిపడుతున్నారు. స్టాఫ్‌ నర్సులు, ఏఎనఎంలతోనే అరకొర వైద్య సేవలు పొందాల్సి వస్తోందని వాపోతున్నారు. 


ఆస్పత్రిలో సౌకర్యాలు కరువు

కూడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అవసరమైన సౌకర్యాలు లే వు. ఆసుప్రతి ఆవరణలో కనీసం తాగునీటి వసతి కూడా కల్పించలేదు. గర్భిణు లకు వారానికోసారి తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలి. పరీక్షలకు అవ సరమైన బీపీ పరికరాలు కూడా లేకపోవడంతో గర్భిణులు వెనుతిరగాల్సి వ స్తోంది. ఉన్నతాధికారులు స్పందించి కూడేరు పీహెచసీకి డాక్టర్లను నియమించి, మెరుగైన పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-01-28T05:26:35+05:30 IST