పెళ్లైన కొత్త జంటలకు తప్పని 'కొవిడ్-19' కష్టాలు.. మాస్కులు వేసుకునే ఆ పని..

ABN , First Publish Date - 2020-02-22T20:01:01+05:30 IST

కొవిడ్-19 మహమ్మారి చైనీయులను తీవ్రంగా కలవర పెడుతోంది. ఇప్పటి వరకు దీని బారిన పడి 2,236 మంది ప్రాణాలు కోల్పోయారు.

పెళ్లైన కొత్త జంటలకు తప్పని 'కొవిడ్-19' కష్టాలు.. మాస్కులు వేసుకునే ఆ పని..

ఫిలిప్పీన్: కొవిడ్-19 మహమ్మారి చైనీయులను తీవ్రంగా కలవర పెడుతోంది. ఇప్పటి వరకు దీని బారిన పడి 2,236 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క చైనాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో  కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇంకొన్ని దేశాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దీంతో చాలా దేశాలు జన సమూహాలను నిషేధిస్తున్నాయి. దీనిలో భాగంగా పెళ్లిలు, ఇతర పార్టీలకు అనుమతి ఇవ్వడం లేదు.


ఇదిలాఉంటే గురువారం ఫిలిప్పీన్‌లోని బాకోల్డ్ సిటీలో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమం.. ఇందులో చోటుచేసుకున్న ఒక ఘట్టానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సుమారు 220 జంటలు ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో పెళ్లితో ఒక్కటయ్యాయి. అయితే, ఈ జంటలు, వారి తరఫున వచ్చిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరూ కూడా కొవిడ్-19 భయానికి ముఖాలకు మాస్కులతోనే హాజరయ్యారు. ఇక పెళ్లితంతులో భాగంగా జంటలు ఉంగరాలు మార్చుకున్న తర్వాత వధువరులు ఒకరినొకరు కిస్ చేసుకున్నారు. అప్పుడు కూడా ముఖాలకు మాస్కులు ధరించే ఈ తంతు కానిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. 

Updated Date - 2020-02-22T20:01:01+05:30 IST