రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన దేశాధినేత

ABN , First Publish Date - 2021-10-02T22:55:28+05:30 IST

రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డెటెర్టే శనివారం ప్రకటించారు. తనను చాలా కాలంగా అధ్యక్షుడిగా కొనసాగించిన ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే కొత్త నాయకత్వం వస్తుందని ఆయన పేర్కొన్నారు..

రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన దేశాధినేత

మనీలా: రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డెటెర్టే శనివారం ప్రకటించారు. తనను చాలా కాలంగా అధ్యక్షుడిగా కొనసాగించిన ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే కొత్త నాయకత్వం వస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రజా విధేయుడినై ఉన్నాను, ఉంటాను. నన్ను ఎన్నో సంవత్సరాలుగా దేశాధ్యక్ష పదవిలో కొనసాగించారు. మీ ఆదేశాల మేరకు నేను నడుచుకుంటాను’’ అని తన రాజీనామా ప్రకటించిన అనంతరం రోడ్రెగో అన్నారు.


అయితే తన కూతురు సారా డుటెర్టెను దేశాధినేతకు చేసేందుకే రోడ్రిగో రాజీనామాకు సిద్ధమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. దీనితో పాటు డ్రగ్స్ కేసు కూడా ఆయనను వెంటాడుతోంది. 2016 నుంచి డ్రగ్స్ కారణంగా అనేక మంది చనిపోయారని, దీనిపై తాము అంతర్జాతీయ కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రొడ్రెగో వైదొలగిన అనంతరం ఫిలిప్పీన్స్ పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

Updated Date - 2021-10-02T22:55:28+05:30 IST