పాజిటివ్‌ అంటూ క్వారంటైన్‌కు తరలింపు.. రిజల్ట్‌లో నెగిటివ్‌..!

ABN , First Publish Date - 2020-07-25T21:15:31+05:30 IST

పాజిటివ్‌ వచ్చిందంటూ కొంతమంది బాధి తుల్ని భీమవరం క్వారంటైన్‌కు తరలించారు. తీరా అక్కడ ఫలితాల రిపోర్టులో చూస్తే నెగిటివ్‌గా వచ్చింది. దీనితో బాధితులు తీవ్ర మానసిక వేదనకు గుర య్యారు.

పాజిటివ్‌ అంటూ క్వారంటైన్‌కు తరలింపు.. రిజల్ట్‌లో నెగిటివ్‌..!

బాధితుల ఆవేదన


ఆకివీడురూరల్‌ (పశ్చిమ గోదావరి జిల్లా): పాజిటివ్‌ వచ్చిందంటూ కొంతమంది బాధి తుల్ని భీమవరం క్వారంటైన్‌కు తరలించారు. తీరా అక్కడ ఫలితాల రిపోర్టులో చూస్తే నెగిటివ్‌గా వచ్చింది. దీనితో బాధితులు తీవ్ర మానసిక వేదనకు గుర య్యారు. ఆకివీడు మండలం సిద్ధాపురం, కళింగపాలెం, చినిమిల్లిపాడు గ్రామాలలో ఈనెల18వ తేదీన నలుగురు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో ముగ్గురికి ఈనెల23వ తేదీ గురువారం మధ్యాహ్న సమయంలో 98662 25605 నెంబరు నుంచి కాల్‌ చేసి మీకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, క్వారంటైన్‌కు తరలించేందుకు వాహనం వస్తుందని సిద్ధంగా ఉండాలని తెలి పారన్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు వాహనంలో సిద్ధాపురం, కళింగపాలెం గ్రామాలకు చెందిన ఇద్దరిని తీసుకుని రాత్రి 12 గంటలకు భీమవరంలోని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించినట్టు తెలిపారు.


అయితే శుక్రవారం మధ్యాహ్న సమయంలో కరోనా పరీక్షా ఫలితాల్లో నెగెటివ్‌ వచ్చి నట్టు తమకు మెసేజ్‌ వచ్చిందని తెలిపారు. దీంతో క్వారంటైన్‌లో విచారించగా తమకు ఎటువంటి సమాచారం లేదని, పై నుంచి సమాచారం వస్తే డిశ్చార్జి చేస్తామని, లేదంటే పరీక్షలు నిర్వహించి చెబుతామని తెలిపారన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎటువంటి ఆహారం, తాగడానికి మంచినీళ్లు   ఇవ్వలేదని వాపోయారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వాళ్లతో బస్సులో రావడం, పాజిటివ్‌ వ్యక్తుల మధ్య క్వారంటైన్‌లో ఉండడం ఆందోళనగా ఉంద ని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా పాజిటివ్‌ అని ఫోన్‌కాల్‌ వచ్చినవారిలో ఒక గర్భిణీ కూడా ఉంది. అయితే రాత్రి కావడం వల్ల వాహనం రాకపోవడంతో ఆమెను తరలించలేదు. ఆ తర్వాత ఆమెకు నెగిటివ్‌ అని మెసేజ్‌ రావడంతో ఆమె, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2020-07-25T21:15:31+05:30 IST