ఐ ఫోన్‌లో ఫొటో, వీడియో ఎడిటింగ్‌ టూల్స్‌

ABN , First Publish Date - 2021-06-12T05:30:00+05:30 IST

ఐఓఎస్‌ యూజర్లకు ఎడిటింగ్‌ ఫీచర్లను గూగుల్‌ అందుబాటులోకి తెస్తోంది. ఈ ఫీచర్లు ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఇప్పటికే

ఐ ఫోన్‌లో ఫొటో, వీడియో ఎడిటింగ్‌ టూల్స్‌

ఐఓఎస్‌ యూజర్లకు ఎడిటింగ్‌ ఫీచర్లను గూగుల్‌ అందుబాటులోకి తెస్తోంది. ఈ ఫీచర్లు ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఇప్పటికే ఉన్నాయి. ఐఫోన్లలో ఫొటో ఎడిటర్‌లో సరికొత్త టాబ్‌ ఒకటి వస్తోంది. ఎంపిక చేసుకున్న ఫొటోను బట్టి మెషిన్‌ లెర్నింగ్‌ ఉపయోగించి సూచనలు అందుతాయి. బ్రైట్‌నెస్‌, కాంట్రాస్ట్‌ సహా పలు సూచనలు ఇందులో ఉంటాయి. గూగుల్‌ ఫొటోస్‌ - సదరు ఫొటోలను మరింత మెరుపర్చుకోవడానికి తోడు కలర్‌పాప్‌ను కూడా వినియోగదారులకు అందిస్తుంది.


పోర్ట్రయిట్స్‌, ల్యాండ్‌స్కేప్స్‌, సూర్యాస్తమయం సహా పలు ఫొటోలకు మున్ముందు సూచనలను చేస్తుంది. ఏయే మార్పులు వర్తిస్తాయన్నది చూడాలని అనుకుంటే, ఫొటో ఛేంజ్‌లో నిర్దేశిత ఎడిట్‌కు సంబంధించి పలు సూచనలు   కనిపిస్తాయి. వీడియో ఎడిటింగ్‌కు సంబంధించి ట్రిమ్‌, రొటేట్‌, క్రాప్‌, అడ్జెస్ట్‌, ఫిల్టర్‌ అప్లికేషన్స్‌ను వినియోగదారులకు ఐఫోన్‌ అనుమతిస్తుంది. ఏతావతా న్యూ ఎడిటర్‌తో కొంగ్రొత్త అనుభవాలు వినియోగదారులకు కలుగుతాయని గూగుల్‌ పేర్కొంది. 


Updated Date - 2021-06-12T05:30:00+05:30 IST