కజిరంగా నేషనల్ పార్క్‌లో ‘గోల్డెన్ టైగర్’

ABN , First Publish Date - 2020-07-13T02:10:28+05:30 IST

అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో అరుదైన గోల్డెన్ టైగర్‌‌(బంగారు వర్ణపు పులి) సంచరిస్తున్నట్లు...

కజిరంగా నేషనల్ పార్క్‌లో ‘గోల్డెన్ టైగర్’

దిస్‌పుర్: అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో అరుదైన గోల్డెన్ టైగర్‌‌(బంగారు వర్ణపు పులి) సంచరిస్తున్నట్లు గుర్తించారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మయూరేశ్ హెంద్రే ఈ పులి కదలికలను తన కెమెరాలో బంధించారు. ఈ సందర్భంగా హెంద్రే మాట్లాడుతూ, గోల్డెన్ టైగర్స్ చాలా అరుదుగా ఉంటాయని చెప్పారు. ‘అయితే విస్తృతమైన సంతానోత్పత్తి కారణంగా పులుల్లో జన్యులోపం ఏర్పడుతుందని కొందరు చెబుతారు. దానివల్లే పులులు ఈ రంగులోకి మారతాయని వారి అభిప్రాయం’ అని హెంద్రే పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 

ఈ ఫోటోలను అటవీ శాఖాధికారి ప్రవీణ్ కశ్యప్ శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. వేలాది లైక్‌లను సొంతం చేసుకుంటున్నాయి.

Updated Date - 2020-07-13T02:10:28+05:30 IST