Abn logo
Apr 8 2020 @ 05:30AM

భౌతిక దూరం పాటించాలి

గూడూరు(రూరల్‌), ఏప్రిల్‌ 7: చెన్నూరులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను మంగళవారం రెవెన్యూ సిబ్బంది తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సరుకులు విక్రయించాలన్నారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, తాజుద్దీన్‌, హేమంత్‌, విష్ణు తదితరులు పాల్గొన్నారు.


లాక్‌డౌన్‌ కారణంగా  దాతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారని, అయితే, సేవా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో భౌతిక దూరాన్ని పాటించడం లేదని తహసీల్దారు రవికుమార్‌ అన్నారు. మంగళవారం మండలంలోని రేషన్‌ దుకాణాల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించేలా శాశ్వత సర్కిల్స్‌ ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాలు నిర్వహించే వారు, దుకాణాలకు వెళ్లే వారు భౌతిక దూరాన్ని పాటించకపోతే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరు కరోనా నియంత్రణకు సహకరించాలన్నారు.

Advertisement
Advertisement
Advertisement