దివ్యాంగుల కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్‌

ABN , First Publish Date - 2022-06-07T13:28:10+05:30 IST

స్థానిక అన్నాసాలైలోని దివ్యాంగుల సంక్షేమ శాఖ సంచాలకుల ప్రధాన కార్యాలయంలో దివ్యాంగుల కోసం రూ.కోటితో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి ఎంకే

దివ్యాంగుల కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్‌

                     - ప్రారంభించిన Cm Stalin


చెన్నై, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక అన్నాసాలైలోని దివ్యాంగుల సంక్షేమ శాఖ సంచాలకుల ప్రధాన కార్యాలయంలో దివ్యాంగుల కోసం రూ.కోటితో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. ఆ కార్యాలయాన్ని సోమవారం ఉదయం సీఎం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ కార్యాలయంలో దివ్యాంగుల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాల ద్వారా లబ్ధ్దిపొందినవారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ‘అన్నీ సాధ్యం’ పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఆ ఎగ్జిబిషన్‌లో దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు, సాంకేతిక పరికరాలు ప్రదర్శనకు ఉంచారు. అంతే కాకుండా దివ్యాంగుల జీవనానికి సరిపోయేలా ‘మోడల్‌ గృహం’ కూడా ఉంది. అనంతరం ముఖ్యమంత్రి ఆరుగురు దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు, వీల్‌చైర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గీతా జీవన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి లాల్‌వేనా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-07T13:28:10+05:30 IST