శాశ్వత ప్రాతిపదికన వైద్యులను నియమించాలి

ABN , First Publish Date - 2021-05-14T09:04:13+05:30 IST

కరోనా సంక్షోభం దృష్ట్యా రాష్ట్ర ప్రభు త్వం శాశ్వత ప్రాతిపదికన వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించాలని బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు

శాశ్వత ప్రాతిపదికన వైద్యులను నియమించాలి

బండి సంజయ్‌ డిమాండ్‌ 


హైదరాబాద్‌, మే 13(ఆంధ్రజ్యోతి): కరోనా సంక్షోభం దృష్ట్యా రాష్ట్ర ప్రభు త్వం శాశ్వత ప్రాతిపదికన వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించాలని బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు ఇవ్వడంలేదని, ఈ పరిస్థితిలో మూడు నెలల కోసం ఏ డాక్టరు వస్తారని ప్ర శ్నించారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రకటించిన రూ.2,500 కోట్లను తక్షణం వైద్యరంగానికి విడుదల చేయాలన్నారు. కరోనా బారినపడిన మీడియా ప్రతినిధులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కరోనా నియంత్రణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బండి సంజయ్‌ విమర్శించారు. పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుబాషా,  జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, మోర్చా ఇన్‌చార్జి మనోహర్‌రెడ్డితో పాటు మోర్చా పదాధికారులతో  గురువారం ఆన్‌లైన్‌ సమావేశంలో మాట్లాడారు. మోర్చా కార్యకర్తల సేవా హీ సంఘటన్‌ ద్వారా సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వారంలోగా అన్ని కమిటీలను ఏర్పాటుచేయాలని, సంస్థాగతంగా బలోపేతం కావాలని సూచించారు.

Updated Date - 2021-05-14T09:04:13+05:30 IST