రంజాన్ వేళ పాక్‌‌లో విషాదం... ల్యాండింగ్‌కు సరిగ్గా ఒక్క నిమిషం ముందు కూలిన విమానం

ABN , First Publish Date - 2020-05-22T23:23:02+05:30 IST

కరాచీ: మరో రెండు రోజుల్లో రంజాన్ పండుగ జరుపుకోబోతోన్న పాక్‌లో విషాదకర ఘటన జరిగింది. లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న విమానం

రంజాన్ వేళ పాక్‌‌లో విషాదం... ల్యాండింగ్‌కు సరిగ్గా ఒక్క నిమిషం ముందు కూలిన విమానం

కరాచీ: మరో రెండు రోజుల్లో రంజాన్ పండుగ జరుపుకోబోతోన్న పాక్‌లో విషాదకర ఘటన జరిగింది. లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న విమానం  కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పీకే-8303 విమానంలో సిబ్బంది సహా 107 మంది ఉన్నారు. ప్రమాదంలో 98 మంది చనిపోయారని అధికారులు ధృవీకరించారు. కరాచీ విమానాశ్రయంలో విమానం దిగడానికి సరిగ్గా నిమిషం ముందు విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సంబంధాలు తెగిపోయాయి. విమాన ఇంజన్ ఫెయిల్ అయిందని పైలట్ చెప్పిన క్షణాల్లోనే విమానం కూలిపోయింది. 




ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని మోడల్ కాలనీలోని ఇళ్లపై విమానం కూలిపోయింది. భీకర శబ్దంతో పాటు పొగ, మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా జరిగిన ఘటనతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు ప్రారంభించింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రుల్లో చేర్పించారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 





మరోవైపు ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. 




ఘటనపై విచారణకు ఆదేశించామని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సీఈవో అర్షద్ మలిక్ తెలిపారు. 

Updated Date - 2020-05-22T23:23:02+05:30 IST