'Dreamersకి అమెరికా పౌరసత్వం ఇవ్వండి’

ABN , First Publish Date - 2021-07-30T01:18:20+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చిన వారికి పౌరసత్వం అంశంపై.. దాదాపు 90 బడా టెక్ సంస్థల సీఈఓలు సంయుక్తంగా యూఎస్ కాంగ్రెస్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో చ

'Dreamersకి అమెరికా పౌరసత్వం ఇవ్వండి’

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చిన వారికి పౌరసత్వం అంశంపై.. దాదాపు 90 బడా టెక్ సంస్థల సీఈఓలు సంయుక్తంగా యూఎస్ కాంగ్రెస్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో చర్చనీయాంశం అయింది. వివరాల్లోకి వెళితే.. ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా చిన్నతనంలోనే అమెరికాకు వలస వెళ్లి, అక్కడే పెరిగిన యువకులను డ్రీమర్స్ అనే పేరుతో పిలుస్తున్న విషయం తెలిసిందే. కాగా.. డ్రీమర్స్‌గా గుర్తింపు పొందిన యువకులకు అమెరికా పౌరసత్వం లభించేలా చట్టం తేవాలని దిగ్గజ సంస్థల సీఈఓలు లేఖ ద్వారా యూఎస్ కాంగ్రెస్‌ను కోరారు. 'డ్రీమర్స్ అని పిలువబడే వలసదారులు.. మా కంపెనీలలో విలువైన ఉద్యోగులుగా ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి వారి సేవలు అవసరం. చట్టం ద్వారా వారు అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం సుగమం చేయండి’ అని లేఖలో పేర్కొన్నారు. యూఎస్ కాంగ్రెస్ లేఖ రాసిన సీఈఓల జాబితాలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు. 


Updated Date - 2021-07-30T01:18:20+05:30 IST