సర్వే నిలుపుదలకు హైకోర్టులో పిల్‌

ABN , First Publish Date - 2020-10-24T10:44:18+05:30 IST

రాష్ట్రంలోని షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనేతరుల స్థిర,చర ఆస్తులు సర్వే జరిపి మెరూన్‌కలర్‌ పాసుపుస్తకాలు జారీ చేసేందుకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆదివాసీ సంక్షేమపరిషత్‌(ఏఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు పూనెం

సర్వే నిలుపుదలకు హైకోర్టులో పిల్‌

ఏజెన్సీలో గిరిజనేతరుల ఆస్తుల నమోదు  చేయొద్దు: ఏఎస్‌పీ


ఇల్లెందు, అక్టోబర్‌23: రాష్ట్రంలోని షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనేతరుల స్థిర,చర ఆస్తులు సర్వే జరిపి మెరూన్‌కలర్‌ పాసుపుస్తకాలు జారీ చేసేందుకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆదివాసీ సంక్షేమపరిషత్‌(ఏఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు పూనెం శ్రీనివాస్‌, ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు నైతం బాదు హైకోర్టులో ఫిల్‌ దాఖలు చేశారు. రిట్‌ పిటిషన్‌ పిల్‌ ఎస్‌ఆర్‌ 24500 తేదీ 2020 ఆక్టోబరు 22న హైకోర్టులో పిల్‌ దాఖలుచేశారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఏజెన్సీ ప్రాంతాల ప్రత్యేక హక్కులు, గిరిజన చట్టాలకు విరుద్ధంగా షెడ్యూల్డ్‌ ఏరియాల్లో 1970 పిదప వలసవచ్చిన వారి ఆస్తులను కూడా సర్వే చేసి పాసుపుస్తకాలు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టుకు వివరించారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ అక్టోబరు 3న జారీచేసిన సర్వే ఉత్తర్వులను రద్దు చేయాలని, గిరిజనుల హక్కులు కాపాడాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమశాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీలను, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ను, ఏజెన్సీ ప్రాంతాలతో కూడిన 13 జిల్లాల కలెక్టర్‌లను, నలుగురు ఐటీడీఎల ప్రాజెక్టు అధికారులను ప్రతివాధులుగా పేర్కొంటు ఏఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు పూనెం శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  

Updated Date - 2020-10-24T10:44:18+05:30 IST