పైలెట్ ఉద్యోగం పోవడంతో అతని జీవితమే మారిపోయింది... ఆదాయం రెండితలయ్యింది!

ABN , First Publish Date - 2021-08-28T17:28:54+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని...

పైలెట్ ఉద్యోగం పోవడంతో అతని జీవితమే మారిపోయింది... ఆదాయం రెండితలయ్యింది!

లండన్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. కొందరు తిండికి కూడా నోచుకోని స్థితికి చేరుకున్నారు. ప్రస్తుత కరోనా కాలంలో ఎయిర్‌లైన్స్ కంపెనీలు గడ్డురోజులను ఎదుర్కొంటున్నాయి. ఈ సంస్థలలో పనిచేసే కొంతమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. పైలెట్ ఎరోన్ లెవెంథల్ కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. 


యూకేకి చెందిన ఎరోన్ లెవెంథల్ ఉన్న ఉద్యోగం కోల్పోవడంతో లారీ డ్రైవర్‌గా మారారు. ఉద్యోగం పోయిందని 37 ఏళ్ల ఎరోన్ లెవెంథర్ ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. తనకు గతంలో కాస్త అనుభవం ఉన్న లారీ డ్రైవర్ వృత్తిని చేపట్టాలనుకున్నారు. ఇందుకోసం ముందుగా ట్రక్కు నడిపేందుకు అవసరమ్యే హెచ్‌జీవీ లైసెన్స్ తీసుకున్నారు.  ఫ్రీలాన్స్ డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఎరోన్ లెవెంథల్ పైలెట్‌గా పనిచేస్తున్నప్పుడు అతనికి ఏడాదికి 30 వేల పౌండ్లు అంటే మన కరెన్సీలో రూ. 30 లక్షలకు పైగా జీతం వచ్చేది. అయితే ఇప్పుడు ట్రక్కు డ్రైవర్‌గా అతనికి ఏడాదికి 40 పౌండ్లకు మించిన ఆదాయం వస్తోంది. పైలెట్‌గా పని చేసేటప్పుడు ఎరోన్ లెవెంథల్ గంటకు 9 పౌండ్లు సంపాదిస్తుండగా, లారీ డ్రైవర్‌గా గంటకు సుమారు 30 పౌండ్లకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

Updated Date - 2021-08-28T17:28:54+05:30 IST