పైలట్ లేని విమానాన్ని టెస్ట్ చేసిన బోయింగ్.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-03-02T22:38:31+05:30 IST

పైలట్ లేని విమానం గాలిలో ఎగిరింది. ప్రముఖ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ సంస్థ బోయింగ్ ఈ ప్రయోగం నిర్వహించింది. ఆస్ట్రేలియాకు చెందిన రాయల్..

పైలట్ లేని విమానాన్ని టెస్ట్ చేసిన బోయింగ్.. వీడియో వైరల్

కాన్‌బెర్రా: పైలట్ లేని విమానం గాలిలో ఎగిరింది. ప్రముఖ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ సంస్థ బోయింగ్ ఈ ప్రయోగం నిర్వహించింది. ఆస్ట్రేలియాకు చెందిన రాయల్ ఎయిర్‌ఫోర్స్(ఆర్ఏఏఎఫ్)తో కలిసి ఈ ప్రయోగం నిర్వహించి విజయవంతమైంది. దీనికి లాయల్ వింగ్‌మ్యాన్ అని బోయింగ్ సంస్థ పేరు పెట్టింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఆస్ట్రేలియాలోనే డిజైన్ చేసి, అక్కడే తయారు చేయనున్నట్లు బోయింగ్ వెల్లడించింది. దీనికి వివిధ రకాల పేలోడ్‌లను, బాంబులను, సెన్సార్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని, దీనివల్ల దీనిని అన్ని విధాలుగా వినియోగించుకోవచ్చని బోయింగ్ చెబుతోంది.


ఇదిలా ఉంటే దీంతో గత 50 ఏళ్లలో ఆస్ట్రేలియాలో తయారవుతున్న ఏకైక ఫైటర్ జెట్‌గా ఈ విమానం నిలవనుంది. దీనిని నేలపై నుండే నడిపేలా డిజైన్ చేశారు. విమానాన్ని తక్కువ వేగంలో, ఎక్కువ వేగంలో ఎగురవేశారు. అలాగే తక్కువ ఎత్తులో, ఎక్కువ ఎత్తులోనూ ప్రయోగించారు. అన్ని రకాలుగానూ విమానం విజయవంతంగా పరీక్షల్లో నెగ్గింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా బోయింగ్ విడుదల చేసింది. 



Updated Date - 2021-03-02T22:38:31+05:30 IST