Army chopper crash: డ్యామ్‌లో పైలట్ మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-08-16T14:19:29+05:30 IST

జమ్మూలోని రంజిత్ సాగర్ డ్యామ్ లో కుప్పకూలిన ఆర్మీకి చెందిన రుద్ర హెలికాప్టరులో ఓ పైలెట్ మృతదేహాన్ని తాజాగా వెలికితీశారు....

Army chopper crash: డ్యామ్‌లో పైలట్ మృతదేహం లభ్యం

జమ్మూ : జమ్మూలోని రంజిత్ సాగర్ డ్యామ్ లో కుప్పకూలిన ఆర్మీకి చెందిన రుద్ర హెలికాప్టరులో ఓ పైలెట్ మృతదేహాన్ని తాజాగా వెలికితీశారు. విశాఖపట్టణం నుంచి పఠాన్‌కోట్ నగరానికి రక్షణ పరికరాలను తరలిస్తుండగా రుద్ర ఆర్మీ హెలికాప్టరు జమ్మూలోని రంజిత్ సాగర్ డ్యామ్‌లో కుప్పకూలిపోయింది. దీంతో భారత వాయుసేన డ్యామ్ జలాశయంలో 12 రోజుల నుంచి గాలింపు చేపట్టింది. ఆగస్టు 11వతేదీన రుద్ర హెలికాప్టరు శిథిలాలను వాయుసేన అధికారులు గుర్తించారు. మళ్లీ తాజాగా ఒక పైలెట్ మృతదేహం లభించింది. ‘‘ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో రంజిత్ సాగర్ సరస్సు నుంచి పైలట్ లెఫ్టినెంట్ కల్నల్ ఏఎస్ బాత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. 


కో-పైలట్ (కెప్టెన్) కోసం అన్వేషణ కొనసాగుతోంది’’అని కథువా జిల్లా పోలీసు చీఫ్ ఎస్‌ఎస్‌పి రమేష్ చందర్ కొత్వాల్ చెప్పారు.ఆర్మీ ఆఫీసర్ యొక్క మృతదేహాలను 75.9 మీటర్ల లోతు నుండి 1819 గం (6.19 pm) వద్ద తిరిగి పొందామని, కో-పైలట్ అవశేషాలను గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు.ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), రంజిత్ సాగర్ డ్యామ్ అథారిటీలు నీటి అడుగున సెర్చ్ ఆపరేషన్ వేగవంతం చేశాయి. 


విస్తారమైన సరస్సులో దాదాపు 80 మీటర్ల లోతులో హెలికాప్టర్ శిథిలాలు లభించాయి. రంజిత్ సాగర్ ఆనకట్ట 25 కిలోమీటర్ల పొడవు, 8 కిలోమీటర్ల వెడల్పుతో  500 అడుగుల కంటే ఎక్కువ లోతు ఉంది. రుద్ర హెలికాప్టర్ ఆగస్టు 3 న ఉదయం 10.43 గంటల సమయంలో పఠాన్‌కోట్ సమీపంలోని డ్యామ్ సరస్సులోకి కుప్పకూలింది. 

Updated Date - 2021-08-16T14:19:29+05:30 IST