పైనాపిల్‌ పులావ్‌

ABN , First Publish Date - 2021-08-05T19:38:13+05:30 IST

బాస్మతి బియ్యం- 200 గ్రాములు, పైనాపిల్‌ ముక్కలు- కప్పు, ఉల్లిముక్కలు - కప్పు, మిరియాల పొడి- అర స్పూను, వెల్లుల్లి ముక్కలు- అర స్పూను,

పైనాపిల్‌ పులావ్‌

కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం- 200 గ్రాములు, పైనాపిల్‌ ముక్కలు- కప్పు, ఉల్లిముక్కలు - కప్పు, మిరియాల పొడి- అర స్పూను, వెల్లుల్లి ముక్కలు- అర స్పూను, సోయా సాస్‌- అర స్పూన్‌, పచ్చి మిర్చి- రెండు, జీడిపప్పు- పావు కప్పు, కొత్తిమీర తురుము- మూడు స్పూన్లు, ఉప్పు, నీళ్లు- తగినంత.


తయారుచేసే విధానం: బియ్యాన్ని బాగా కడిగి పావు గంట నానబెట్టాలి. తరువాత మందపాటి గిన్నెలో బియ్యాన్ని ఉడికించాలి. కాస్త ఉడకగానే స్టవ్‌ కట్టేసి నీళ్లను వంపేసి ఓసారి నీళ్లతో కడిగి పక్కన పెట్టాలి. ఓ బాణలిలో నూనె వేసి ఉల్లిముక్కలు వేసి వేయించాలి. మిర్చి తరుగు, జీడిపప్పు కూడా వేయాలి. అన్నీ దోరగా వేగాక పైనాపిల్‌ ముక్కలు, మిరియాల పొడి, సోయా సాస్‌ వేసి బాగా కలపాలి. ఆ తరవాత ఉడికిన అన్నాన్ని కూడా వేసి కలిపితే పైనాపిల్‌ పులావ్‌ సిద్ధం. పైన కొత్తిమీర తురుము అలంకరించాలి.

Updated Date - 2021-08-05T19:38:13+05:30 IST