గులాబీ గుబులు

ABN , First Publish Date - 2022-09-16T05:56:43+05:30 IST

పత్తి రైతుల్లో గులాబీ రంగు పురుగు గుబులు పుట్టిస్తోంది. ఈ యేడు అధిక వర్షాలు కురవడంతో పంట తీవ్రంగా దెబ్బతింది. దీనికి తోడు అప్పుడే గులాబీ రంగు పురుగు ఉధృతి కనిపించడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.

గులాబీ గుబులు

జిల్లాలో పత్తి పంటను ఆశిస్తున్న పింక్‌బోల్‌ వార్మ్‌  

పురుగు ఉధృతితో దిగుబడులపై అన్నదాతల ఆందోళన

విచ్చలవిడిగా పురుగుల మందుల వాడకంతో పెరిగి పోతున్న ఖర్చుభారం నామమాత్రంగానే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు

జిల్లా ఇన్‌చార్జీ అధికారితో పూర్తిగా కొరవడుతున్న పర్యవేక్షణ

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : పత్తి రైతుల్లో గులాబీ రంగు పురుగు గుబులు పుట్టిస్తోంది. ఈ యేడు అధిక వర్షాలు కురవడంతో పంట తీవ్రంగా దెబ్బతింది. దీనికి తోడు అప్పుడే గులాబీ రంగు పురుగు ఉధృతి కనిపించడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్న కాస్త పంటనైనా కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం పంట పూత, కాత దశలో ఉంది. కాయ దశలోనే గులాబీ రం గు పురుగు (పింక్‌ బోల్‌వార్మ్‌) ఉధృతి మొదలైంది. ఈ యేడు వానకాల సీజన్‌లో జిల్లా సాధారణ సాగు విస్తీ ర్ణం 5లక్షల 72వేల ఎకరాలు కాగా ఇందులో 3లక్షల 98 వేల ఎకరాలలో పత్తి పంట సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు కా స్తా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే పంట ఎదుగుదల కనిపించి ఏపుగా పెరుగుతుంది. కాయదశలో ఉన్న పత్తి పంటపై పింక్‌బోల్‌ వార్మ్‌ దాడులు అన్నదాతలను కలవర పెడుతోంది. పురుగు నివారణకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఉధృతి తగ్గడం లేదని వాపోతున్నారు. తాంసి, తలమడుగు, జైనథ్‌, బేల, ఇ చ్చోడ, ఉట్నూర్‌, బోథ్‌ మండలాల్లో పురుగు ఉధృతి అధి కంగా ఉంది. గతేడు అనుకూలమైన వాతావరణం, మద్ధతును మించిన ధర పలుకడంతో ఈ సారి పత్తి పంట సాగు వైపు రైతులు ఆసక్తి చూపారు. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సకాలంలో పురుగు ఉధృతిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టకుంటే అసలుకే మోసం వస్తుందని అన్నదాతలు పేర్కొంటున్నారు. అ యితే క్షేత్ర స్థాయిలో పర్యటించి సలహాలు, సూచనలు అందించాల్సిన వ్యవసాయ శాఖాధికారులు పత్తా లేకుండా పోతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులు ఇచ్చిన మందునే పిచికారీ చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు. అయితే జిల్లా వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి అధికారితోనే నెట్టుకొస్తున్నారు. పూర్తి స్థాయి అధికారులు లేక పోవడంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కొరవడుతోంది. 

దిగుబడులపై ఆందోళన..

ఈ యేడు అధిక వర్షాలు కురవడంతో జిల్లా వ్యాప్తంగా లక్షా 3వేల ఎకరాలకుపైగా పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. దీనికి తోడు గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగి పోవడంతో అసలు పెట్టిన పెట్టుబడులు చేతికి వస్తాయో రావోనన్న ఆందోళన కనిపిప్తోంది. కాయ తొలుచు గులాబీ రంగు పురుగుతో పం టకు తీవ్ర నష్టం కలిగి దిగుబడిపై ప్రభావం చూపు తోందంటున్నారు. పిల్ల పురుగులు పూ మొగ్గలను తొలు చుకొని లోనికి ప్రవేశించి కాయ పదార్థాన్ని తినేయడంతో చిరు కాయలు, పూత రాలి పోతోందని రైతులు వాపోతున్నారు. ఎన్ని రసాయన మందులను పిచికారీ చేసినా ప్రయోజనం లేదంటున్నారు. కాయలోనికి చొచ్చుకెళ్లిన పురుగులు ధీర్ఘకాలికంగా కాయలోనే ఉండిపోవడంతో పత్తి నాణ్యతపై ప్రభావం పడుతోంది. అలాగే కాయలు ఎదిగే కొద్ది గింజలను, దూదిని నష్ట పరుస్తూ కాయ పక్వానికి రాకుండా చేస్తాయి. మొక్క ఎంత ఎదిగిన కా యలు పనికి రాకుండా పోవడంతో పూర్తిగా పంటను తొలగించాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. దిగుబడులు తగ్గి పోవడంతో పాటు నాణ్యత లేక పోవడంతో ఆశించిన మద్దతు ధర కూడా దక్కే అవకాశం ఉండదంటున్నారు. నాణ్యత లేదన్న కారణంగా అధికారులు పంటను కొనుగోలు చేయరని చెబుతున్నారు. గులాబీరంగు పురుగు నియంత్రణపై అధికారులు నిండు నిర్లక్ష్యాన్ని చూపడంతో రైతులు తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అడ్డగోలుగా రసాయన మందుల వాడకం..

వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు కరువవడంతో సాగు అనుభవం ఉన్న రైతులే సొంతం గా రసాయన మందులను కొనుగోలు చేసి అడ్డగోలుగా పిచికారీ చేస్తున్నారు. అయినా ఫలితం కనిపించడం లే దు. పక్షం రోజుల క్రితం వరకు భారీ వర్షాలు కురవడంతో రసాయన మందుల పిచికారీకి కూడా అవకాశమే లేకుండా పోయింది. దీంతో పురుగు ఉధృతి మరింతగా 



పెరిగింది. ప్రస్థుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పురుగు మందులను పిచికారీ చేస్తున్నా పురుగు ఉధృతి అదుపులోకి రావడం లేదంటున్నారు. పలుమార్లు వ్యవసాయ శాఖాధికారులకు సంప్రదించిన అందుబాటులో లేక పోవడంతో వ్యాపారులు ఇచ్చిందే మందుగా మారుతోం ది. కొందరు వ్యాపారులు అధిక లాభాలు వచ్చే పురుగు మందులనే రైతులకు అంటగడుతున్నట్లు గులాబీరంగు పురుగు నివారణకు చేపట్టాల్సిన చర్యలపై రైతుల్లో ఏ మాత్రం అవగాహన కనిపించడం లేదు. ఇప్పటికే ఐదా రు సార్లు పురుగు మందులను పిచికారీ చేయడంతో ఎక రాన రూ.10 నుంచి రూ.15వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. కాయ పగిలే వరకు ఇంకెంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుందోనని ఆవేదనకు గురవుతున్నారు. 

వ్యవసాయ అధికారులు పత్తా లేరు..

- దేవన్న (రైతు, టెంబి, బజార్‌హత్నూర్‌)

నాకున్న 4 ఎకరాలలో పత్తి పంటను సాగు చేశాను. ప్రారంభంలో అధిక వర్షాల కారణంగా పంట భాగా దెబ్బతింది. ఇ ప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో గులాబీ రంగుపురుగు ఆశించి కాయలను తొలిచే స్తోంది. కాత,పూత పెరుగుతున్న సమయంలో పురుగు ఉఽ దృతి తీవ్రంగా నష్ట పరుస్తోంది. పురుగు ఆశించడంతో పూ త, చిరుకాయలు నేలరాలి పోతున్నాయి. ఇప్పటికే ఎన్ని రకా ల రసాయన మందులను పిచికారీ చేసినా ఫలితం లేకుం డా పోయింది. వ్యవసాయ శాఖాధికారులు పత్తా లేకుండానే పోయారు. ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు.  


సకాలంలోనే గుర్తించాలి..

- రాజశేఖర్‌  (ఏరువాక శాస్త్రవేత్త, ఆదిలాబాద్‌)

పత్తి పంటను ఆశించే గులాబీ రంగు పురుగు ఉధృతిని సకాలంలో గుర్తిస్తేనే నష్ట నివారణ సాధ్యపడుతుంది. లేకపోతే తీవ్రంగా నష్ట పోయే ప్రమాదం ఉంటుంది. పురుగులు కాయలోనికి చొచ్చుకెళ్లిన తర్వాత ఎన్ని మందులను పిచికారి చేసిన అంతగా ఫలితం ఉండదు. రైతులు తరచుగా పంటలను పరిశీలిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కొత్త తెగలు సోకినట్లు కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖాధికారులను సంప్రదించి అవసరమైన పురుగు మందులను పిచికారీ చేయాలి. 


Updated Date - 2022-09-16T05:56:43+05:30 IST