Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్ని రంగాల్లో అగ్రగామిగా పెందుర్తి

ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌

పెందుర్తి, డిసెంబరు 3: పెందుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ తెలిపారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో నియోజకవర్గ ప్రగతి నివేదిక, నాడు-నేడు రెండో దశ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలకు రూ.378 కోట్లు, అభి వృద్ధి పనులకు రూ.108 కోట్ల నిధులు వెచ్చించామన్నారు. పెందుర్తి, సబ్బవరం, పరవాడ ప్రాం తాల్లో గల 50 పాఠశాలలను రూ.50 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. స్థానిక ప్రభుత్వ కళాశాలను రూ.5 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కాగా ఈ నెల 7న ప్రశాంతి నగర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని నిర్వహించనున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మదుపాడ నాగమణి, జడ్పీటీసీ ఉప్పిలి దేవి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గొర్లె రామునాయుడు, నక్క కనకరాజు, ఎల్‌బీ నాయుడు, ఎంపీబీవో మంజులవాణి, ఎంఈవో సునీత పాల్గొన్నారు.

Advertisement
Advertisement