గుంతల దారి.. జాగ్రత్త బాటసారి

ABN , First Publish Date - 2021-10-14T05:27:27+05:30 IST

రోడ్డుపైకి వాహనదారులు రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఏ గుంత ఎక్కడుందో.. ఏ ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. దగ్గరకు వస్తే కానీ రోడ్డు గుంతలు పడిన సంగతి తెలియనందున స్పీడుగా వచ్చే వారు కిందపడి గాయాలపాలవుతున్నారు.

గుంతల దారి.. జాగ్రత్త బాటసారి
జయరాజగార్డెన్‌ సమీపంలో ఉన్న గుంతలు

ఇబ్బందుల్లో వాహనదారులు         

పట్టించుకోని పాలకులు 


రోడ్డుపైకి వాహనదారులు రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఏ గుంత ఎక్కడుందో..  ఏ ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. దగ్గరకు వస్తే కానీ రోడ్డు గుంతలు పడిన సంగతి తెలియనందున స్పీడుగా వచ్చే వారు కిందపడి గాయాలపాలవుతున్నారు. నిత్యం ఇదే దారిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు రాకపోకలు సాగిస్తున్నా మాకెందుకులే అన్న ధోరణిలో ఉండడంతో సమస్య అలాగే ఉంది. వివరాల్లోకెళ్తే.. 


సీకేదిన్నె, అక్టోబరు 13: మండలంలోని ఊటుకూరు రింగ్‌రోడ్డు నుంచి పులివెందుల రోడ్డులోని సాక్షి సర్కిల్‌ వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా తయారైంది. ఎటు చూసినా గుంతలు ఉండ డంతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దగ్గరకొస్తే కానీ గుంతలు పడినట్లు తెలియకపోవడంతో స్పీడుగా వచ్చే వాహన దారుడు సడన్‌ బ్రేక్‌ వేయక తప్పదు. తద్వారా కిందపడి గాయాల పాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి. అంతేకాక సడన్‌ బ్రేక్‌ వేయడం వల్ల వెనుక వచ్చే వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న పరిస్థితులూ ఉన్నాయి. 

ఇదిలా ఉంటే పబ్బాపురం సమీపంలో ఉన్న బ్రిడ్జీపై గుంతలు పడి కడ్డీలు కనిపిస్తున్నాయి. నిత్యం అనేక మంది అధికారులు, ప్రజాప్రతినిధులు వెళుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై వాహనదారులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేసి వాహనదారుల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.



Updated Date - 2021-10-14T05:27:27+05:30 IST