నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-10-24T05:16:05+05:30 IST

కాకినాడ సిటీ/పిఠాపురం, అక్టోబరు 23: అమూల్య విత్తనాలు సాగు చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. శనివారం కాకినాడలో వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టరు విజయకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. వర్మ మాట్లాడుతూ మహేంద్రసీడ్స్‌కు చెందిన అమూల్య స్వర్ణ రకం వరి విత్తనాలను పిఠాపురం నియో

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
కాకినాడలో వ్యవసాయశాఖ జేడీకి వినతిపత్రం అందజేస్తున్న వర్మ

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

కాకినాడ సిటీ/పిఠాపురం, అక్టోబరు 23: అమూల్య విత్తనాలు సాగు చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. శనివారం కాకినాడలో వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టరు విజయకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. వర్మ మాట్లాడుతూ మహేంద్రసీడ్స్‌కు చెందిన అమూల్య స్వర్ణ రకం వరి విత్తనాలను పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో ఎక్కువగా వేశారన్నారు. సుమారు 15వేల ఎకరాల్లో పంటకు నష్టం జరిగిందని, రైతులు దిగుబడులు పూర్తిగా కోల్పోతున్నారని వర్మ తెలిపారు. పిఠాపురంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో ఈ రకం సాగు చేసిన రైతులు నష్టపోయారన్నారు. అమూల్య రకం సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.35 వేలు పరిహారం ఇవ్వాలని, విత్తనాల కంపెనీ, డిస్ట్రిబ్యూటర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆయన డిమా ండ్‌ చేశారు. టీడీపీ కాకినాడ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు అల్లుమల్లు విజయకుమార్‌, మండలాధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్‌, నల్లా శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T05:16:05+05:30 IST