చిన్నచిన్న తగాదాలతో కాపురాల్లో చిచ్చు

ABN , First Publish Date - 2021-12-02T04:21:37+05:30 IST

కలిసి నూరేళ్లు జీవించాల్సిన దంపతులు చిన్నచిన్న తగాదాలు, గొడవలతో పోలీసు స్టేషన్‌కు వెళ్తున్నారు. దీంతో పచ్చని కాపురాలు మూడు నాళ్లకే పరిమితిమవు తున్నాయి. దంపతుల గొడపడడం పసిపిల్లలపై పెను ప్రభావం చూపుతోంది.

చిన్నచిన్న తగాదాలతో కాపురాల్లో చిచ్చు

- పసిపిల్లలపై పెను ప్రభావం

- రోజురోజుకు పెరుగుతున్న కేసులు

- కౌన్సిలింగ్‌ చేసినా మారని తీరు

- గ్రామాల్లోనే అధికం

సిర్పూర్‌(టి), డిసెంబరు 1: కలిసి నూరేళ్లు జీవించాల్సిన దంపతులు చిన్నచిన్న తగాదాలు, గొడవలతో పోలీసు స్టేషన్‌కు వెళ్తున్నారు. దీంతో పచ్చని కాపురాలు మూడు నాళ్లకే  పరిమితిమవు తున్నాయి. దంపతుల గొడపడడం పసిపిల్లలపై పెను ప్రభావం చూపుతోంది. భర్తలు మద్యం సేవిస్తూ భార్యలపై అక్రమసంబంధాలు, అనుమా నాలు పెంచుకుంటున్నారు. అలాగే అత్తమామల పోరు పడలేక, అదనపు కట్నం కోసం తరుచూ వేధించడం తదితర కారణాలతో పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. సిర్పూర్‌(టి) పోలీసు స్టేషన్‌పరిధిలోని 16గ్రామపంచాయతీల్లోని 26 గ్రామాల్లో జనవరి 1నుంచి నేటివరకు 73భార్య భర్తల కేసులు, 62భూవివాదాలు, ఇతర కేసులు స్వల్పంగా నమోదయ్యాయి. అయితే మెజార్టీ కేసులు మాత్రం నెలకు సగటున అయిదు నుంచి 10కేసులు భార్యభర్తలవే అవుతున్నట్లు పోలీసు ఫిర్యాదు విభాగం అధికారులు తెలుపుతున్నారు. కొందరు భర్తలు మద్యంకు అలవాటుపడి కుటుం బ పోషణ సరిగ్గా చూసుకోవడం లేదని భార్యల నుంచి ఫిర్యాదు వస్తున్నాయి. ఇలావస్తున్న కేసుల్లో అధికంగా గ్రామీణ ప్రాం తాల నుంచే వస్తున్నట్లు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఇటీవల పెరిగిన స్మార్ట్‌ఫోన్‌ విని యోగం వల్ల కూడా దీనిని ఒక బలమైన కారణమని చెప్పవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కొంత మంది దంపతులు తరుచూ గొడవలకు దిగడంతో ఆ ప్రభావం పిల్లలపైపడి వాళ్లు చదు వులు మధ్యలోనే మానే స్తున్నారు. ఇదిలా ఉండ గా కొందరు గ్రామాల్లో కులపెద్దలు, మతపెద్దలు, ఇతర నాయకుల వద్దకు కుటుంబ తగాదాలు తీసు కెళ్తున్నారు. అయితే పెద్దలసమక్షంలో కొంతమంది దంపతులు తమ తప్పును తెలుసుకుంటూ సర్దుకు పోతుండగా మరికొంత మంది మాత్రం యథావిధిగా గొడవలు పెట్టుకుంటు న్నారు. ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలో సఖి కౌన్సిలింగ్‌ సెంటర్‌, 181కేంద్రాలు ఏర్పాటుతో కొంతమేర కేసులు తగ్గుతున్నాయి.

మెజార్టీ కేసులు భార్యాభర్తలవే వస్తున్నాయి..

- ఎం రవికుమార్‌, ఎస్సై

 సిర్పూర్‌(టి) పోలీసు స్టేషన్‌ పరిధిలో 27గ్రామాల నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు భార్యభర్తల కేసులే అధికంగా వచ్చాయి. ఇరు వర్గాలతో ఫ్యామిలీ కౌన్సి లింగ్‌ నిర్వహించి అవసర మైతే జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రానికి పంపి స్తున్నాం. ఫ్రెండ్లీ పోలీసు ద్వారా పలు కేసులు పరిష్కరించాం.

Updated Date - 2021-12-02T04:21:37+05:30 IST