పిజ్జాకు ఫిదా అయిన బామ్మ.. అవ్వ హావభావాలకు ఫిదా అవుతున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2021-11-10T03:05:41+05:30 IST

సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. విచిత్రంగా ఉండే వీడియోలు మరింత వైరల్ అవుతుంటాయి. అక్టోబర్ 28న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ బామ్మ వీడియో తెగ వైరల్ అవుతోంది.

పిజ్జాకు ఫిదా అయిన బామ్మ.. అవ్వ హావభావాలకు ఫిదా అవుతున్న నెటిజన్లు..

ఒకప్పటి ఆహారపు అలవాట్లకు, ప్రస్తుత అలవాట్లకు ఎంతో తేడా ఉంది. అప్పట్లో కల్తీ లేని ఆహారం లభించేది. అందుకే అప్పటి కాలం వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. నేటి యువత ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడి.. చిన్న వయసులోనే వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. గ్రామీణ ఆహారపు అలవాట్లకు పూర్తిగా దూరమవుతున్నారు. అయితే విచిత్రంగా ఓ బామ్మకు మాత్రం పిజ్జా తెగ నచ్చేసింది. దాని టేస్టుకు ఫిదా అయింది. పిజ్జాను రుచి చూసిన వెంటనే.. బామ్మ ఇచ్చిన హావభావాలకు అంతా ఫిదా అవుతున్నారు.


సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. విచిత్రంగా ఉండే వీడియోలు మరింత వైరల్ అవుతుంటాయి. అక్టోబర్ 28న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ బామ్మ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు బామ్మలు పిజ్జా బాక్సును తెరిచారు. ఓ బామ్మ ముక్క తీసుకుని పక్కనున్న స్నేహితురాలికి ఇచ్చింది. మొదట సంశయంతో పిజ్జాను తీసుకున్న బామ్మ.. నోట్లో పెట్టుకోగానే వావ్ అన్నట్లుగా చిరునవ్వు నవ్వింది. ‘నాని జీ మొదటిసారి పిజ్జా తింటుంది’ అనే క్యాప్షన్‌‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన వారంతా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి.



Updated Date - 2021-11-10T03:05:41+05:30 IST