పడమటి మండలాల అభివృద్ధికే పీకేఎంయూడీఏ

ABN , First Publish Date - 2021-10-25T06:15:02+05:30 IST

పలమనేరు, కుప్పం, మదనపల్లె అర్బన్‌ డెవలెప్‌మెంట్‌ అఽథారిటీ చైర్మన్‌గా శక్తివంచన లేకుండా విధులు నిర్వర్తిస్తానని ఎన్‌.వెంకటరెడ్డియాదవ్‌ చెప్పారు. పంచాయతీరాజ్‌ అథితిగృహ ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమమంలో సబ్‌కలెక్టర్‌ ఎం.జాహ్నవి, ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.

పడమటి మండలాల అభివృద్ధికే పీకేఎంయూడీఏ
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఘనంగా చైర్మన్‌ ప్రమాణస్వీకారం


మదనపల్లె, అక్టోబరు 24: పలమనేరు, కుప్పం, మదనపల్లె అర్బన్‌ డెవలెప్‌మెంట్‌ అఽథారిటీ  చైర్మన్‌గా శక్తివంచన లేకుండా విధులు నిర్వర్తిస్తానని ఎన్‌.వెంకటరెడ్డియాదవ్‌ చెప్పారు. పంచాయతీరాజ్‌ అథితిగృహ ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమమంలో సబ్‌కలెక్టర్‌ ఎం.జాహ్నవి, ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యఅథితిగా విచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... తుడా, చుడా తరహాలో పడమటి మండలాల అభివృద్ధి కోసం పీకేఎంయూడీఏను ఏర్పాటు చేశామన్నారు. ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఎం.నవాజ్‌బాషా,  ద్వారకనాథరెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్‌ శ్రీనివాసులు, ఏపీఎండీసీ చైర్‌పర్సన్‌ జి.షమీంఅస్లాం, కురబసంఘం రాష్ట్రఅధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు, పాల ఏకరి కార్పొరేషన్‌ చైర్మన్‌ మురళీధర్‌, డీసీసీబీ చైర్‌పర్సన్‌ ఎం.రెడ్డెమ్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు వి.మనూజ, అలీమ్‌బాషా, మున్సిపల్‌ వైస్‌చైర్మన్లు జింకా వెంకటాచలపతి, బి.ఎ.నూర్‌ఆజాం, కౌన్సిలర్లు,  జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం పీకేఎంయూడీఏ కార్యాలయాన్ని మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. 

Updated Date - 2021-10-25T06:15:02+05:30 IST