కోవర్టులుంటే ఇప్పుడే పారిపోండి..

ABN , First Publish Date - 2022-01-23T05:09:30+05:30 IST

టీడీపీలో కోవర్టులు ఉంటే ఇప్పుడే పారిపోండి.. లేదంటే మారండని ఆపార్టీ సిటి ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హెచ్చరించారు.

కోవర్టులుంటే ఇప్పుడే పారిపోండి..
మాట్లాడుతున్న కోటంరెడ్డి పక్కనే డివిజన్‌ నాయకులు

వచ్చే ఎన్నికల్లో 40 వేల మెజార్టీ తథ్యం

 మంత్రి అనిల్‌ వేలకోట్ల నల్లధనాన్ని కూడా బెట్టారు..

 టీడీపీ సిటి ఇన్‌చార్జి కోటంరెడ్డి

నెల్లూరు, (వ్యవసాయం), జనవరి 22 : టీడీపీలో కోవర్టులు ఉంటే ఇప్పుడే పారిపోండి.. లేదంటే  మారండని ఆపార్టీ సిటి ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హెచ్చరించారు. స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం నగరంలోని 28 డివిజన్ల కార్యకర్తలు, నాయకులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవర్టులుగా వ్యవహరిస్తూ లోపారికాయ ఒప్పందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. రాబోయే ఎన్నికల్లో నగర నియోజకవర్గంలో టీడీపీకి 40వేల పైచిలుకు మెజారిటీ  తథ్యమన్నారు. డివిజన్లలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారినికి కృషి చేయాలన్నారు. కరోనా బాధితులకు అండగా నిలిచి మనోధైర్యాన్ని నింపాలని పిలుపునిచ్చారు. వారి చికిత్సకు అవసరమైన అన్ని అవసరాలను టీడీపీ తీరుస్తుందని హామీ ఇచ్చారు. రోడ్లు, తాగునీరు వంటి కనీస వసతులు ఉన్నాయా లేదా పరిశీలించాలన్నారు. అదేవిధంగా పార్కులను సందర్శించి అసంపూర్తిగా ఉన్న వాటి వివరాలను తమకు తెలపాలన్నారు. వైసీపీ వైఫల్యాలను ప్రజలకు తెలపాలని సూచించారు. వేల కోట్ల నల్లధనాన్ని కూడబెట్టిన ఘనత మంత్రి అనిల్‌, రూప్‌కుమార్‌యాదవ్‌లకు దక్కుతుందన్నారు. మంత్రి నగరాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. ఇసుక నుంచి కరోనా ఇంజక్షన్లు, కాంట్రాక్టుల పేరుతో వారు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీని ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాదేనని స్పష్టం చేశారు. నాప్రాణం ఉన్నంత వరకు ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని అన్నారు. సమావేశంలో డివిజన్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T05:09:30+05:30 IST