సైబర్ క్రైం కు నివేదించండి... ఎస్‌బీఐ వీడియో అలర్ట్...

ABN , First Publish Date - 2021-01-17T23:09:31+05:30 IST

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)... మోసగాళ్ళపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ తన ఖాతాదారులను ఓ వీడియో ద్వారా అప్రమత్తం చేసింది. ఆన్‌లైన్ ఫ్రాడ్‌కు సంబంధించి ఈ హెచ్చరికలు చేసింది.

సైబర్ క్రైం కు నివేదించండి... ఎస్‌బీఐ వీడియో అలర్ట్...

ముంబై :  ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)... మోసగాళ్ళపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ  తన ఖాతాదారులను ఓ వీడియో ద్వారా అప్రమత్తం చేసింది. ఆన్‌లైన్ ఫ్రాడ్‌కు సంబంధించి ఈ హెచ్చరికలు చేసింది. ఎస్‌బీఐవిడుదల చేసిన ఈ వీడియో కేవైసీ ధృవీకరణకు సంబంధించింది. ఎస్‌బీఐ ఈ వీడియోను ట్వీట్ చేసింది. ఎస్బీఐ సహా వివిధ బ్యాంకులు ఎప్పటికప్పుడు తమ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయన్న విషయం తెలిసిందే. 'ఫ్రాడ్ కాల్స్, సందేశాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.' అని ఆ వీడియోలో పేర్కొంది. 


ఫ్రాడ్‌స్టర్స్ ఫోన్ కాల్ చేయడం ద్వారా లేదా టెక్స్ట్ సందేశాలు పంపించడం ద్వారా, బ్యాంకు ప్రతినిధిగా నమ్మించే ప్రయత్నాలు చేస్తారని, తద్వారా మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన, వ్యక్తిగత వివరాలను రాబట్టుకునే  యత్నం చేస్తారని పేర్కొంది. అలాంటి అంశాలు దృష్టికి వచ్చినప్పుడు cybercrime.gov.in కు నివేదించాలని హెచ్చరించింది. 


Updated Date - 2021-01-17T23:09:31+05:30 IST