1 నుంచి ప్లాస్టిక్‌ కవర్లు నిషేధం

ABN , First Publish Date - 2021-10-19T04:18:58+05:30 IST

సూళ్లూరుపేట మున్సిపాలిటీలో నవంబరు ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్‌ కవర్లను నిషేధిస్తున్నట్లు స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ నరేంద్రకుమార్‌ వెల్లడించారు.

1 నుంచి ప్లాస్టిక్‌ కవర్లు నిషేధం

సూళ్లూరుపేట, అక్టోబరు 18 : సూళ్లూరుపేట మున్సిపాలిటీలో నవంబరు ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్‌ కవర్లను నిషేధిస్తున్నట్లు స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ నరేంద్రకుమార్‌ వెల్లడించారు. సోమవారం సాయంత్రం మున్సిపల్‌ కార్యాలయంలో పట్టణంలోని ప్లాస్టిక్‌ కవర్ల హోల్‌సేల్‌ వ్యాపారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్‌ కవర్లు అమ్మకూడదని ఆదేశించారు. ఎవరైనా విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2021-10-19T04:18:58+05:30 IST