Abn logo
Jun 23 2021 @ 11:44AM

వ్యూహాత్మకంగా సీఎం కే‌సీఆర్ అడుగులు..

హైదరాబాద్: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఇప్పటి నుంచే తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. పాలనలో వేగం పెంచడం, రాజకీయ ఎత్తుగడలకు పదును పెట్టడానికి విజన్ 2023యే కారణమన్న వాదన టీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం సందర్భంగా ఏపీ ప్రాజెక్టులపై తాడే పేడే తేల్చుకోవాలని నిర్ణయించడం వెనుక బహుళ లక్ష్యాలు ఉన్నాయనే చర్చ పార్టీలో జరుగుతోంది. కృష్ణా జలాల వినియోగంలో ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెలంగాణకు అన్యాయం చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ గానీ, కాంగ్రెస్ గానీ గట్టిగా పోరాడ్డంలేదని టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది, నిలబడేది టీఆర్ఎస్ మాత్రమే అనే సందేశం ఇచ్చినట్లయిందని  చెబుతున్నారు.