ప్రపోజ్‌ చేస్తున్నారా..!

ABN , First Publish Date - 2020-11-18T05:34:16+05:30 IST

ఇష్టపడిన వాళ్లకు మనసులోని మాటను చెప్పే సందర్భం ప్రత్యేకంగా ఉండాలి. పూలకొమ్మతో లేదా ప్రేమలేఖతో వారిపై ప్రేమను తెలియజేయవచ్చు. అలా కాదు మీరు ప్రేమను వ్యక్తం చేసిన క్షణం వారికి ఆశ్చర్యం కలిగించేలా, జీవితాంతం గుర్తుండేలా ఉండాలంటే మాత్రం పర్‌ఫెక్ట్‌గా ప్లాన్‌ చేయాలి...

ప్రపోజ్‌ చేస్తున్నారా..!

ఇష్టపడిన వాళ్లకు మనసులోని మాటను చెప్పే సందర్భం ప్రత్యేకంగా ఉండాలి. పూలకొమ్మతో లేదా ప్రేమలేఖతో వారిపై ప్రేమను తెలియజేయవచ్చు. అలా కాదు మీరు ప్రేమను వ్యక్తం చేసిన క్షణం వారికి ఆశ్చర్యం కలిగించేలా, జీవితాంతం గుర్తుండేలా ఉండాలంటే మాత్రం పర్‌ఫెక్ట్‌గా ప్లాన్‌ చేయాలి అంటున్నారు లవ్‌ గురూలు. అదెలాగంటే... 


  1. డిన్నర్‌ డేట్‌: మీరు ప్రేమించే వాళ్లకు ప్రపోజ్‌ చేసేందుకు వారిని డిన్నర్‌ డేట్‌కు తీసుకెళ్లాలి. క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ చేస్తూ మీ మనసులోని మాటను వారితో చెప్పాలి. ఆ రొమాంటిక్‌ మూమెంట్‌ వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది.
  2. మొదటిసారి కలిసిన చోటు: మీ హృదయంలోని మాటను చెప్పేందుకు మీరు ఇద్దరు ఒకరినొకరు మొదటిసారి చూసుకున్న చోటు లేదా కలిసిన ప్రదేశాన్ని మించినది మరొటి ఉండదు. అక్కడ వారికి ప్రపోజ్‌ చేస్తే వారు ఆనందం, ఆశ్చర్యంతో పాటు థ్రిల్‌గా ఫీలవుతారు. 
  3. ఇంట్లోవాళ్ల సమక్షంలో: ఇద్దరి కుటుంబసభ్యులు మీ ప్రేమకు పచ్చజెండా ఊపితే అంతకన్నా ఏం కావాలి. ఇరు పెద్దల సమక్షంలో మీ ప్రేమను తెలియజేస్తే ఆ క్షణం మీ ఇద్దరికీ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. 
  4. ఫొటో ఆల్బమ్‌: మీరు కలిసి దిగిన ఫొటోలతో వీడియో తయారుచేసి, బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు నచ్చిన పాట వచ్చేలా చూడాలి. ప్రతి ఫొటో మీ ప్రేమకు అద్దం పట్టేలా, మీ హృదయ భాషను చెప్పేలా ఉండాలి.
  5. ట్రిప్‌ ప్లాన్‌: మీ ఇద్దరికి ఇష్టమైన ప్రదేశానికి సడన్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేయాలి. అక్కడికి వెళ్లాక మీ ప్రియతమకు ప్రపోజ్‌ చేయాలి. నచ్చిన ప్రదేశంలో సరదాగా గడపాలి. ఆ రోజును ఎప్పుడు తలచుకున్నా ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది.
  6. పజిల్‌ సర్‌ప్రైస్‌: మీ ప్రియతమతో పజిల్‌ లేదా కిండర్‌ జాయ్‌ చాకో బాక్స్‌లో ఉంగరం దాచి ఉంచి దాన్ని ఓపెన్‌ చేయించాలి. అప్పుడు ప్రపోజ్‌ చే సి, ఆశ్చర్యపరచాలి. 
  7. సూర్యాస్తమయంలో: నిర్మలంగా, ఆహ్లాదంగా ఉండే సూర్యాస్తమం ఎంతో రొమాంటిక్‌గా ఉంటుంది. ఆ సమయంలో మీ మనసులోని మాటను తెలియజేస్తే ఎంతో స్పెషల్‌గా ఫీలవుతారు. 

Updated Date - 2020-11-18T05:34:16+05:30 IST