రౌడీషీటర్‌ హత్యకు కుట్ర.. ఏడుగురు అరెస్ట్‌.. జైలు నుంచే పక్కా స్కెచ్‌

ABN , First Publish Date - 2020-07-04T18:37:34+05:30 IST

ఓ రౌడీషీటర్‌ హత్యకు కుట్ర పన్నిన కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పేరం రామకృష్ణ ప్రస్తుతం తెనాలి జైలులో ఉండగా మిగిలిన ఏడుగురు నిందితులను శుక్రవారం అరండల్‌పేట

రౌడీషీటర్‌ హత్యకు కుట్ర.. ఏడుగురు అరెస్ట్‌.. జైలు నుంచే పక్కా స్కెచ్‌

తెనాలి జైలు నుంచే పక్కా స్కెచ్‌

ప్రధాన నిందితుడు నేటికీ జైలులోనే

ఆధిపత్య పోరు...అభద్రతా భావమే కారణమా...

క్రికెట్‌ బెట్టింగ్స్‌ లావాదేవీలపైనా అనుమానాలు


గుంటూరు (ఆంధ్రజ్యోతి): ఓ రౌడీషీటర్‌ హత్యకు కుట్ర పన్నిన కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పేరం రామకృష్ణ ప్రస్తుతం తెనాలి జైలులో ఉండగా మిగిలిన ఏడుగురు నిందితులను శుక్రవారం అరండల్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫిరంగిపురం మండలం గరుడాచలం గ్రామానికి చెందిన సింగంశెట్టి వెంకట సత్యనారాయణ, కాకుమానువారితోటకు చెందిన చింతల సతీష్‌, కొరిటెపాడుకు చెందిన ముళ్ళపూడి రామబ్రహ్మం, పాతగుంటూరుకు చెందిన యార్లగడ్డ శివకోటేశ్వరరావు, బుచ్చయ్యతోటకు చెందిన జొన్నకూటి సుకేష్‌, పాతగుంటూరుకు చెందిన తోట వంశీ, బుచ్చయ్యతోటకు చెందిన యనగాలశెట్టి యామిని దుర్గా కృష్ణను అరెస్ట్‌ చేసి వారి నుంచి 8 కత్తులను స్వాదీనం చేసుకున్నట్లు అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్‌ ఎస్పీ నిందితులు మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. 


కాకుమానువారితోటకు చెందిన రౌడీషీటర్‌ బసవల వాసును 2017లో అరండల్‌పేటలో పేరం రామకృష్ణ, సతీష్‌తో పాటు మరో 20 మంది వరకు కలసి  చంపారు. దీంతో ప్రత్యర్ధుల హత్యకు వాసు అనుచరులు పధకం రూపొందించగా లాలాపేట పోలీసులు అరెస్ట్‌ చేసి హత్యకుట్రను భగ్నం చేశారు.  ఎప్పటికైనా వాసు వర్గీయులనుంచి తమకు ముప్పు తప్పదని వాసు కేసులో ప్రధాన నిందితులైన ఆర్‌కే, చెకోడీల సతీష్‌ భావించారు. ఈ క్రమంలో కాలవ రమణను హత్య చేయాలని నిర్ణయించారు. పధకం ప్రకారం ఆర్‌కే కోర్టు వాయిదాలకు వెళ్ళలేదు. దీంతో కోర్టు వారెంట్‌ జారీ చేయడంతో మార్చి 20న అరెస్ట్‌ చేసి తెనాలి జైలుకు తరలించారు. దీంతో తెనాలి జైలు నుంచి హత్యకు పధకం రూపొందించాడు. గతంలో రౌడీషీటర్‌ చింతల శ్రీను హత్య కేసులో  రమణ ప్రధాన నిందితుడుగా ఉం డటంతో శ్రీను తనయుడు సతీష్‌ను ముందుపెట్టి తన అనుచరులతో రమణను హత్య చేయించాలని చెకోడీల సతీష్‌తో కలసి పధకం వేశాడు. ఇందుకుగాను చింతల సతీష్‌ను రామబ్రహ్మం తెనాలి జైలుకు తీసుకువెళ్ళి ఆర్‌కేకు పరిచయం చేశాడు.


సతీష్‌ను ముందుఉంచి తన అనుచరులతో రమణను హత్య చేయించి, చింతల శ్రీను హత్యకు ప్రతీకారమని పోలీసులను నమ్మించి తా ను కేసు నుంచి తప్పించు కోవచ్చని ప్లాన్‌ వేశాడు.  గ తంలో తమతో పాటు వాసు హత్యకేసులో నిందితులుగా ఉన్న శివ కోటేశ్వరరావు, సుకేష్‌, వంశీలను సిద్ధం చేశారు. అయితే ఈ విషయంలో వెనకడుగు వేసిన చింతల సతీష్‌ హత్యాపధకాన్ని లీక్‌ చేశాడు. దీంతో నిఘా వర్గాలు, అరండల్‌పేట పోలీసులు రంగంలోకి దిగి హత్యాపధకాన్ని భగ్నం చేశారు.  ఈ కేసులో కొందరు మాజీ రౌడీషీటర్లు, క్రికెట్‌బుకీల ప్రమేయం ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై కూడా విచారిస్తున్నామని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. అరండల్‌పేట కేం ద్రంగా వ్యాపారం చేస్తున్న యువకుడి ప్రమేయంపై కూ డా విచారిస్తున్నట్లు వెల్లడించారు. రౌడీషీటర్లపై ఉక్కు పాదం మోపుతామని ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు. అర్బన్‌లో 750 మంది రౌడీషీటర్లు ఉన్నారన్నారు. వారిలో జాడ తెలియని సుమారు 100 మంది  వివ రాలు సాంకేతిక పరిజ్ఞానంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో వెస్ట్‌ డీఎస్పీ బివి రామారావు, కొత్తపేట సీఐ రాజ శేఖర్‌రెడ్డి, అరం డల్‌పేట ఎస్సై రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-04T18:37:34+05:30 IST