మా సంతకముంటేనే పథకాలివ్వండి

ABN , First Publish Date - 2021-08-14T06:04:31+05:30 IST

పింఛను, రేషన్‌కార్డు, చేయూత.. ఇలా పథకం ఏదైనా అర్హులకు లబ్ధి కలగాలంటే వారి దరఖాస్తు మీద అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుడి సంతకం ఉండాల్సిందే. ముందుగానే ఆయా అధికారులకు ఆదేశాలు ఉండడంతో.. వారు కూడా నాయకుల సంతకాలు లేని దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తీరా ఎలాంటి పదవీ లేని ఆ నాయకుడి వద్దకు అర్హులు వెళితే.. ‘నువ్వు మా పార్టీ కాదు.. ఎన్నికల్లో టీడీపీకి ఓటేశావు. నేను సంతకం పెట్టన’ని వెనక్కి పంపేస్తున్నారు. ఫలితంగా అర్హత ఉండీ చాలామంది ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు.

మా సంతకముంటేనే పథకాలివ్వండి
వీరప్పల్లె పంచాయతీలో పథకం మంజూరవ్వాలంటే దరఖాస్తు మీద ఈ నాయకుడి సంతకం ఉండాల్సిందే

వీరప్పల్లెలో వైసీపీ నాయకుడి హవా

టీడీపీకి ఓటేసినవారి పట్ల యంత్రాంగం వివక్ష

పింఛను, రేషన్‌కార్డు, చేయూత.. ఇలా పథకం ఏదైనా అర్హులకు లబ్ధి కలగాలంటే వారి దరఖాస్తు మీద అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుడి సంతకం ఉండాల్సిందే. ముందుగానే ఆయా అధికారులకు ఆదేశాలు ఉండడంతో.. వారు కూడా నాయకుల సంతకాలు లేని దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తీరా ఎలాంటి పదవీ లేని ఆ నాయకుడి వద్దకు అర్హులు వెళితే.. ‘నువ్వు మా పార్టీ కాదు.. ఎన్నికల్లో టీడీపీకి ఓటేశావు. నేను సంతకం పెట్టన’ని వెనక్కి పంపేస్తున్నారు. ఫలితంగా అర్హత ఉండీ చాలామంది ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు.

 చిత్తూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): పెద్దపంజాణి మండలం వీరప్పల్లె పంచాయతీకి చెందిన వైసీపీ నాయకుడొకరు ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ టీడీపీకి ఓటేసిన వారిని గుర్తించి మరీ వలంటీర్ల ద్వారా వారికి అమలయ్యే ప్రభుత్వ పథకాలను రద్దు చేయిస్తున్నాడు.‘నా సంతకం లేని దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవద్దు. ఒకవేళ సంతకం లేకుండా పథకాలు అమలు చేస్తే వలంటీర్లను తొలగిస్తా. సచివాలయ సిబ్బంది అయితే బదిలీ చేయిస్తా’ అని బెదిరిస్తున్నాడు.ఈ నెల 5వ తేదీన సదరు నాయకుడి బాధితులు 8మంది ఎంపీడీవో శివరాజును కలిశారు. పింఛనుకు అర్హత ఉన్నా.. ఆయన సంతకం పెట్టకుండా అడ్డుకుంటున్నాడని.. న్యాయం చేయాలంటూ ఎంపీడీవో కాళ్ల మీద పడి మరీ వేడుకున్నారు.అయితే నాయకుల ఒత్తిడి కారణంగా ఎంపీడీవో వీరి అర్జీని పరిశీలించి సిఫార్సు చేయలేదు.భూమి కొనుక్కున్న ఓ రైతు పట్టాదారు పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నా.. తహసీల్దార్‌ కార్యాలయంలో స్పందించడం లేదు.ఆ నాయకుడి సిఫార్సు తీసుకువస్తే పుస్తకం ఇస్తామని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు.వీరప్పల్లె పంచాయతీలోనే కొంత మంది అర్హులకు పక్కాగృహాలు మంజూరయ్యాయి. వారిలో 15 మందికి అధికారులు వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వలేదు.స్థానిక నాయకుడి అనుమతి లేనిదే ఇవ్వలేమని చెప్పేశారు. దీంతో వీరంతా గత నెలలో కలెక్టర్‌ను కలిసి, తమ సమస్యను చెప్పుకున్నారు. కలెక్టర్‌ కల్పించుకుని స్థానిక అధికారులకు సూచించడంతో వీరి సమస్య పరిష్కారమైంది.

టీడీపీకి ఓటేశారంటూ చేయూత కట్‌

 నిండ్ర మండలం కచరవేడు పంచాయతీ దళితవాడకు చెందిన నలుగురు మహిళలకు రెండో విడత వైఎస్సార్‌ చేయూత పథకాన్ని అందించలేదు. స్థానిక నాయకుల ఒత్తిడి కారణంగా వలంటీర్లు తమ లాగిన్‌లో లబ్ధిదారుల పేర్లను తొలగించారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారనే అనుమానంతో వైసీపీ నాయకులు వారికిలా అన్యాయం చేశారు.

Updated Date - 2021-08-14T06:04:31+05:30 IST