Advertisement
Advertisement
Abn logo
Advertisement

కారుపై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి !

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్‌యూవీ కారుపై ఓ చిన్న విమానం కుప్పకూలడంతో నాలుగేళ్ల బాలుడి సహా ముగ్గురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ ఫ్లోరిడాలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో(అమెరికా కాలమానం ప్రకారం) ఈ ఘటన జరిగింది. ఫ్లోరిడా విమానాశ్రాయానికి వెళ్తున్న విమానం సాంకేతిక లోపం కారణంగా ఇంజన్ ఫెయిల్ కావడంతో ఓ కారుపై కుప్పకూలింది. ఈ ఘటనలో తన తల్లితో కారులో ప్రయాణిస్తున్న 4 ఏళ్ల బాలుడు టేలర్ బిషప్ అక్కడికక్కడే చనిపోయాడు. అలాగే విమానంలోని ఇద్దరు సిబ్బంది కూడా మరణించారు. బాలుడు తల్లి మేగన్ బిషప్ మాత్రం స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమెను హాలీవుడ్ మెమోరియల్ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, కారుపై విమానం కూలిన తర్వాత ఒక్కసారి భారీగా మంటలు చెలరేగాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.


Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement