హైవేపై ల్యాండై.. కారును ఢీ కొట్టిన విమానం..!

ABN , First Publish Date - 2020-12-05T00:35:13+05:30 IST

ఓ విమానం హైవేపై అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన అమెరికాలో డిసెంబర్ 2న చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మిన్న

హైవేపై ల్యాండై.. కారును ఢీ కొట్టిన విమానం..!

వాషింగ్టన్: ఓ విమానం హైవేపై అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన అమెరికాలో డిసెంబర్ 2న చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మిన్నసోటాలోని హైవేపై వాహనాల రద్దీ విపరీతంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ క్రమంలో విమానం ఓ కారును ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరీ ఎటువంటి గాయాలు కాలేదు. కారు ఓనర్‌కు ఫైలెట్‌కు క్షమాపణలు చెప్పి, పరిస్థితి వివరించాడు. కాగా.. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడం మూలంగా హైవేపై అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని ఫైలెట్ వివరించారు. కాగా.. విమానం హైవేపై ల్యాండ్ అవుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీడియోను ఆ రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 


Updated Date - 2020-12-05T00:35:13+05:30 IST