పాచి పట్టిన రహదారి

ABN , First Publish Date - 2021-10-18T05:59:48+05:30 IST

మండలంలోని ప్రసన్నాయపల్లి పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కా లనీ నుంచి ముస్లిం మైనార్టీ కాలనీకి వెళ్లే దారిలో ఉన్న బ్రిడ్జి ప్రమాదకరంగా ఉంది.

పాచి పట్టిన రహదారి
ఇందిరమ్మ కాలనీ వద్ద బ్రిడ్జిపై ప్రమాదకరంగా ఉన్న దారి

రాప్తాడు, అక్టోబరు 17: మండలంలోని ప్రసన్నాయపల్లి పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కా లనీ నుంచి ముస్లిం మైనార్టీ కాలనీకి వెళ్లే దారిలో ఉన్న బ్రిడ్జి ప్రమాదకరంగా ఉంది. పండమేరు వంకపై నిర్మించిన బ్రిడ్జిపై దాదాపు రెండు నెలల నుంచి హంద్రీనీవా నీరు ప్రవహిస్తోంది. నీరు నిరంతరం ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిపై పాచి పట్టింది. ఆ దారి గుండా ద్విచక్రవాహనదారులు అధిక సంఖ్యలో వెళుతుంటారు. పాచి పట్టిన దారిపై ద్విచక్రవాహనదారులు జారి పడుతున్నారు. బ్రిడ్జికి ఇరువైపులా పండమేరు వంకలో పెద్దపెద్ద గుంతల్లో నీరు నిండుగా ఉంది.  బ్రిడ్జికి ఇరువైపులా సిమెంటు ది మ్మెలు మాత్రమే ఉన్నాయి. జారి పడినప్పుడు దిమ్మెల మధ్యలో నుంచి బ్రిడ్జి కింద పడితే చాలా ప్రమాదమని, ఈత రానివారైతే పండ మేరు వంకలో కొట్టుకుపోయే ప్రమా దం ఉందని వాపోతున్నారు. బ్రిడ్జికి ఇరువైపులా గల సిమెంటు దిమ్మెలకు అడ్డంగా ఇనుప దిమ్మెలు అమర్చి ద్విచక్రవాహనదారులు బ్రిడ్జి కిందకు పడకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అలాగే బ్రిడ్జికి ఇరువైపులా ప్రారంభంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడుతున్నారు. 


Updated Date - 2021-10-18T05:59:48+05:30 IST