Aug 4 2021 @ 01:19AM

థియేటర్లలో ప్లాన్‌ చేశారు

శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ప్లాన్‌-బి’. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికేట్‌ లభించింది. ఈ నెల 20న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత ఏవీఆర్‌ చెప్పారు. ‘‘ఆద్యంతం ఉత్కంఠతో సాగే చిత్రమిది. ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వదు. మంచి థియేట్రికల్‌ అనుభూతి ఇస్తుంది. శ్రీనివాసరెడ్డి, మురళీశర్మ, సూర్య వశిష్ఠ, రవిప్రకాశ్‌, అభినవ్‌ సర్దార్‌... ప్రధాన తారాగణం అంతా అద్భుతంగా నటించారు’’ అని దర్శకుడు కేవీ రాజమహి తెలిపారు. ఈ చిత్రానికి ‘ఫిదా’ ఫేమ్‌ శక్తికాంత్‌ కార్తీక్‌ నేపథ్య సంగీతం అందించారు.