ప్రణాళికల రూపకల్పన పక్కాగా చేపట్టాలి

ABN , First Publish Date - 2021-03-03T05:47:00+05:30 IST

ప్రణాళికల రూపకల్పన పక్కాగా చేపట్టాలి

ప్రణాళికల రూపకల్పన పక్కాగా చేపట్టాలి
ఆమనగల్లులో మాట్లాడుతున్న ఎంపీపీ అనితావిజయ్‌

ఆమనగల్లు: అభివృద్ధి పనుల విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీపీ అనితవిజయ్‌, జడ్పీటీసీ అనురాధపత్యనాయక్‌, వైస్‌ఎంపీపీ అనంతరెడ్డి కోరారు. మండల పరిషత్‌లో మంగళవారం ప్రణాళిక రూపకల్పనపై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎంపీడీవో వెంకట్రాములు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్పీ రవీందర్‌రెడ్డి, ఎంపీవో ఉమారాణి, ఏఈలు కృష్ణయ్య, రమేశ్‌గౌడ్‌, ఏపీవో మాధవరెడ్డి, ఎపీఎం కృష్ణయ్య, ఎంపీటీలు, కార్యదర్శులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


  • పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ 

శంషాబాద్‌: బ్లాక్‌ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో పొందుపర్చిన కార్యక్రమాలన్నీ అమలు జరిగేలా చూడాలని అధికారులకు ఎంపీపీ జయమ్మశ్రీనివాస్‌ తెలిపారు. శంషాబాద్‌ మండల పరిషత్‌లో మంగళవారం పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. సిబ్బందికి ఎంపీడీవో కె.వినయ్‌కుమార్‌ రిటైర్డ్‌ ఎంపీడీవో గోపాల్‌కిషన్‌రావు శిక్షణ ఇచ్చారు.

  • స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలి

షాబాద్‌: గ్రామాలను స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని డీఆర్‌డీఏ అధికారి చెన్నకేశవులు అన్నారు. మండల పరిధిలోని పోతుగల్‌లో డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు. సర్పంచ్‌ ఇస్మత్‌బేగం, జీపీ కార్యదర్శి అశోక్‌ గ్రామస్థున్నారు.

  • శిక్షణా తరగతులను వినియోగించుకోవాలి

చేవెళ్ల: ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారుల పాత్ర కీలకమని చేవెళ్ల ఎంపీపీ. విజయలక్ష్మీ తెలిపారు. మంగళవారం చేవెళ్ల మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై కార్యదర్శులు, మండల స్థాయి అధికారులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో హరీశ్‌కుమార్‌, షాబాద్‌ ఎంపీవో హన్మంత్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌, అధికారులు, పాల్గొన్నారు. 

  • బ్లాక్‌ పంచాయతీ అభివృద్ధిపై శిక్షణ

శంకర్‌పల్లి: గ్రామాలలో మౌళిక వసతులు మరింత మెరుగుపరిచేందుకు  ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని శంకర్‌పల్లి ఎంపీడీవో సత్యయ్య పేర్కొన్నారు. ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

  • 4న ఉపాధిహామీ మండల స్థాయి సమావేశం

షాబాద్‌: జాతీయ ఉపాధిహామీ మండల స్థాయి సమావేశం ఈ నెల 4న నిర్వహిస్తున్నట్లు షాబాద్‌ ఎంపీడీవో అనురాధ మంగళవారం తెలిపారు.

Updated Date - 2021-03-03T05:47:00+05:30 IST