అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి

ABN , First Publish Date - 2021-05-14T07:29:38+05:30 IST

జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను సక్రమంగా వినియో గం చేసుకునేవిధంగా అభివృద్ధికి అధికారులు ప్రణాళికలు రూపొందించాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆయన గురువారం తన కార్యాలయం నుంచి జడ్పీ నిధుల వినియోగంపై జిల్లాలోని ఎంపీడీవోలతో ఆన్‌లైన్‌ గూగుల్‌ మీట్‌లో మాట్లాడారు.

అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి
ఆన్‌లైన్‌ గూగుల్‌ మీట్‌లో మాట్లాడుతున్న జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, పాల్గొన్న అధికారులు

గూగూల్‌ మీట్‌లో  జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి

 భువనగిరి రూరల్‌, మే 13: జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను సక్రమంగా వినియో గం చేసుకు నేవిధంగా అభివృద్ధికి అధికారులు ప్రణాళికలు రూపొందించాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆయన గురువారం తన కార్యాలయం నుంచి జడ్పీ నిధుల వినియోగంపై జిల్లాలోని ఎంపీడీవోలతో ఆన్‌లైన్‌ గూగుల్‌ మీట్‌లో మాట్లాడారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు, 2021-22 సంవత్సరానికి యాక్షన్‌ ప్లాన్‌ చేపట్టాలని సూచించారు. ఈ కాన్ఫరె న్స్‌లో జడ్పీ వైస్‌చైర్మన్‌ ధనావత్‌ భీకూనాయక్‌, జడ్పీసీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈవో డిశ్రీనివాసరావు, జడ్పీటీసీలు, కోఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-05-14T07:29:38+05:30 IST