మొక్కల నిర్వహణ అత్యంత కీలకం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-01-29T07:12:06+05:30 IST

హరితహారం కార్యక్రమంలో మొక్కల నిర్వహణ అత్యంత కీలకమని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రాతో కలిసి నగరంలోని సాయినగర్‌, నాగారం, సారంగపూర్‌, బైపాస్‌రోడ్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి రహదారికి ఇరు వైపులా ఉన్న మొక్కలను పరిశీలించారు.

మొక్కల నిర్వహణ అత్యంత కీలకం: కలెక్టర్‌

నిజామాబాద్‌అర్బన్‌, జనవరి 28: హరితహారం కార్యక్రమంలో మొక్కల నిర్వహణ అత్యంత కీలకమని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం  అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రాతో కలిసి నగరంలోని సాయినగర్‌, నాగారం, సారంగపూర్‌, బైపాస్‌రోడ్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి రహదారికి ఇరు వైపులా ఉన్న మొక్కలను పరిశీలించారు. బైపాస్‌ రోడ్‌లో మొక్కలు చక్కగా ఉన్నాయని ఇకముందు కూడా అదే రీతిలో చొరవచూపాలని సంబంధిత అధికారులకు సూచించారు. మొక్కలను సంరక్షించే కూలీలకు ఎప్పటికప్పుడు వేతనం చెల్లిస్తే వారు సంతృప్తికరంగా పనిచేస్తారన్నారు. 

ఫ ప్రతి మొక్కనూ సంరక్షించాలి..

ఇందల్‌వాయి: పల్లెప్రగతిలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. శుక్రవారం మండలంలోని గంగరాంతండా, ఇందల్‌వాయి, గన్నారం, చంద్రాయన్‌పల్లి గ్రామ పంచాయతీల పరిధిలో 44వ నెంబర్‌ జాతీయ రహదారి వెంబడి నాటిన అవెన్యూ ప్లానిటేషన్‌ మొక్కలను పరిశీలించారు. మొక్కల పెంపకంపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారుల సహకారం తీసుకుని ప్రతి మొక్కనూ కాపాడాలని సూచించారు. కలెక్టర్‌ వెంట డీఎఫ్‌వో సునీల్‌, ఎఫ్‌డీవో రామకృష్ణ, ఎంపీడీవో రాములునాయక్‌, ఎఫ్‌డీవో రాజ్‌కాంత్‌, ఏపీవో మంజుల, సర్పంచ్‌ తదితరులు ఉన్నారు. 

ఫ మొక్కల సంరక్షణ అధికారులదే బాధ్యత..

డిచ్‌పల్లి: మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్‌  నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం మండ లంలోని 44వ జాతీయ రహదారి పక్కన నాటిన మొక్కలను నిజామాబాద్‌-డిచ్‌పల్లి రోడ్డు డివైడర్‌ మధ్యలో నాటిన మొక్కలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నాటిన మొక్కకు చుట్టూ నీరు పోసేందుకు, పాదులు తీసి కంచె ఏర్పాటు చేయాలన్నారు. డిచ్‌పల్లి, నిజామాబాద్‌ రహదారి డివైడర్‌ మధ్యలో మొక్కల పక్కన పేరుకుపోయిన పిచ్చి మొక్కలను చూసి కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీడీవో బ్రహ్మానందం, గ్రామ కార్యదర్శులు సునీల్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-29T07:12:06+05:30 IST