Advertisement
Advertisement
Abn logo
Advertisement

మిరప సాగులో సస్యరక్షణ చర్యలు పాటించాలి

తుంగతుర్తి, డిసెంబరు 2: మిరప సాగులో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త ిసీహెచ్‌ నరేష్‌ అన్నారు. మండలంలోని రావులపల్లి గ్రామంలో నల్ల, తామర పురుగులు ఆశించిన మిరప తోటలను గురువారం ఆయన పరిశీలించి  రైతులకు పలు సూచనలు చేశారు. ఉద్యానవన శాఖ అధికారుల సూచనల ప్రకారం  తామర పురుగుల నివారణకు మందులు పిచికారీ చేయాలన్నారు. ఎకరాకు  20 నీలిరంగు అట్టలు చేయాలన్నారు. అదే విధంగా పసుపు రంగు అట్టలు  ఏర్పాటు చేస్తే తెల్ల దోమల నివారణకు ఉపయోగపడతాయన్నారు. రైతులు రసాయన మందులను ఎక్కువ మోతాదులో వినియోగించొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన అదికారి స్రవంతి, శాస్త్రవేత్తలు కిరణ్‌, పాల్గొన్నారు.Advertisement
Advertisement