Abn logo
May 7 2021 @ 00:00AM

నాటిన మొక్కలను సంరక్షించాలి

ఇంద్రవెల్లి, మే 7: హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. శుక్రవారం స్థానిక మేజర్‌ గ్రామ పంచాయతీ ఆవరణలో వాటర్‌ డే సందర్భంగా మొక్కకు నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతూల్యం చేయడానికి మొక్కల పెంపకం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి. ఎంపీడీవో పుష్పలత, ఆర్‌ఐ మెస్రం లక్ష్మణ్‌రావు, సర్పంచ్‌ కోరేంగ గాంధారి పాల్గొన్నారు. అలాగే రంజాన్‌ను పురస్కరించుకొని స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణంలో ముస్లిలంకు కానుకలను అందజేశారు

Advertisement
Advertisement