Abn logo
Sep 27 2021 @ 00:53AM

మానవ మనుగడకు మొక్కలే ఆధారం

జమ్మి మొక్కను నాటిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

- ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

కాల్వశ్రీరాంపుర్‌ సెప్టెంబర్‌ 26: మానవ మనుగడకు మొక్కలే ప్రాణమని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పాండవుల గుట్టపై శ్రీజగత్‌ మహమునిశ్వర స్వామి ఆలయం ఆవరణలో ఎమ్మెల్యే జమ్మి చెట్టును నాటారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు బసవతుల రాజమౌళి ఆచార్యులు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి కి పూర్ణకుంభంతో వేద పాఠశాల పురోహితులతో వేదమంత్రాలతో ఎమ్మె ల్యేకు ఘనస్వాగతం పలికారు. అనంతరం మహమునీశ్వర స్వామి ఆలయంలో దాసరి మనోహర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హరిత తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు అన్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ పిలుపుమేరకు ఊరికి జమ్మిచెట్టు, గుడి గుడికి జమ్మి చెట్టు ఈ కార్యక్రమంలో భాగంగా మ హమునిశ్వర స్వామి ఆలయంలో చెట్టు పెట్ట డం జరిగింది అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం ముందు 48 మందికి షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి చె క్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పీ నూనెటి సంపత్‌యాదవ్‌, జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, సింగిల్‌విండీ చైర్మన్‌ చదువు రామచంద్రారెడ్డి, మండల వైస్‌ఎంపీపీ జూకం టి శిరీష, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ నిదానపురం దేవయ్య, తహసీల్దార్‌ సునీత, ఎంపీ టీసీ మాదాసి సువర్ణ రామచంద్రం, సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.