జీవకోటికి మొక్కలే ప్రాణాధారం

ABN , First Publish Date - 2021-07-24T05:30:00+05:30 IST

జీవకోటి మనుగడకు మొక్కలే ప్రాణాధారమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ సూచించారు.

జీవకోటికి మొక్కలే ప్రాణాధారం
కోదాడలో మొక్క నాటుతున్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌,

కోదాడ / నడిగూడెం, జూలై 24 : జీవకోటి మనుగడకు మొక్కలే ప్రాణాధారమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ సూచించారు. కోదాడలోని 29వ వార్డులో, నడిగూడెంలో మొక్కలు నాటారు. రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అదేవిధంగా కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు వార్డుల్లో కేక్‌కట్‌ చేసి, సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బుర్రా సుధారాణిపుల్లారెడ్డి, చందు నాగేశ్వరరావు, ఒంటిపులి రమా, కోటేశ్వరరావు, చంద్రశేఖర్‌, శ్రీనివాసయాదవ్‌, వెంకటేశ్వర్లు, లలిత, రోజారమణి, ఉపేందర్‌ పాల్గొన్నారు. నడిగూడెం  కార్య క్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతిమధుబాబు, జడ్పీటీసీ బానాల కవితా నాగరాజు, సర్పంచ్‌ గడ్డం నాగలక్ష్మీ మల్లేష్‌యాదవ్‌, పల్లానర్సిరెడ్డి, బడేటి చంద్రయ్య, కాసాని వెంకటేశ్వర్లు, చిల్లంచర్ల సత్యనారాయణ పాల్గొన్నారు. 

నేరేడుచర్ల / పాలకవీడు  /  గరిడేపల్లి రూరల్‌ / హుజూర్‌నగర్‌  / మఠంపల్లి  : కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి మండలం పొనుగోడు, హుజూర్‌నగర్‌లలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మొక్కలు నాటారు. నేరేడుచర్ల తహసీల్దార్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ జయబాబు, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, వైస్‌ ఎంపీపీ తాళూరి లక్ష్మినారాయణ, మార్కెట్‌ చైర్మన్‌ యశోదరాములు, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ చల్లా శ్రీలతారెడ్డి, దొండపాటి అప్పిరెడ్డి, పాలకవీడు ఎంపీపీ భక్యాగోపాల్‌, జడ్పీటీసీ బుజ్జి మోతీలాల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, సర్పంచ్‌ అంజిరెడ్డి, సుబ్బుగౌడ్‌, వెంకటరెడ్డి, భిక్షం, సతీష్‌ పాల్గొన్నారు. పొనుగోడు జరిగిన కార్యక్రమాలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కడియం వెంకటరెడ్డి, సర్పంచ్‌ జోగు సరోజిని పిచ్చిరెడ్డి, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు జోగు అరవిందరెడ్డి, ఉప సర్పంచ్‌ గండ్ర సైదిరెడ్డి, ఎంపీటీసీలు రాంమల్లమ్మ, కడప ఇసాక్‌, రాంసైదులు, షేక్‌ మన్సూర్‌ అలీ, రవీందర్‌రెడ్డి, బసవయ్య పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో మొక్క నాటి, పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజల్లో పాల్గొని పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చనరవి, వైస్‌చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు, చిట్యాల అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని 4వ అంగన్‌వాడీ కేంద్రంలో కౌన్సిలర్‌ శంభయ్య, అంగన్‌వాడీ కార్యకర్త శాంతారాజ్యం మొక్క లు నాటారు. మఠంపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ముడావత్‌ పార్వతీకొండానాయక్‌, జడ్పీటీసీ జగన్‌నాయక్‌, ఎంపీడీవో జానకిరాములు, నాయకులు మన్నెంశ్రీనివా్‌సరెడ్డి, గుండాబ్రహ్మారెడ్డి, కోలహాలం కృష్ణంరాజు, అశోక్‌నాయక్‌, కుతూబ్‌గూడ, వెంకటరెడ్డి, భరత్‌నాయక్‌, పాల్గొన్నారు. 

సూర్యాపేట టౌన్‌ : పట్టణంలో ది క్లాత్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సంఘం పట్టణ అధ్యక్షుడు గండూరి కృపాకర్‌ జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ తాహేర్‌పాష, భావుసింగ్‌, కమలాకర్‌, కృష్ణ, సయ్యద్‌ పాల్గొన్నారు. 

సూర్యాపేటరూరల్‌ : మొక్కల ప్రాధాన్యాన్ని భావితరాలకు తెలిసేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. జిల్లా కార్యాలయంలో మొక్కలు నాటారు.   

తిరుమలగిరి : తిరుమలగిరి మునిసిపాలిటీ పరిధిలో వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పోతరాజు రజనీరాజశేఖర్‌, వైస్‌చైర్మన్‌ సంకెపల్లి రఘునందన్‌రెడ్డి, కమిషనర్‌ దండు  శ్రీను, కౌన్సిలర్లు బత్తుల శ్రీను, శాగంటి అనసూయరాములు, సంకెపల్లి జ్యోతినరోత్తం రెడ్డి, షకీల్‌, రవిందర్‌, ఖదీర్‌, లక్ష్మణ్‌, రాములు, రాజేందర్‌ పాల్గొన్నారు.

చిలుకూరు : మండల వ్యాప్తంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రశాంతికోటయ్య, జడ్పీటీసీ శిరీషానాగేంద్రబాబు, ఎంపీడీవో ఈదయ్య, తహసీల్దార్‌ రాజేశ్వరి, డీసీసీబీ డైరెక్టర్‌ కొండా సైదయ్య, ఎంపీవో ముక్కపాటి నర్సింహారావు, అలసకాని జనార్థన్‌, బట్టు శివాజీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

చింతలపాలెం : మండలకేంద్రంలోని బస్‌స్టాండ్‌ సెంటర్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు కేక్‌కట్‌ చేసి అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మోర్తాల వెంకటరెడ్డి, జడ్పీటీసీ చంద్రకళసైదిరెడ్డి, ఎంపీపీ కొత్తమది వెంకటరెడ్డి,రంగాచారి, శ్రీను, గులాం పాల్గొన్నారు. 

గరిడేపల్లి రూరల్‌ : మంత్రి  కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివా్‌సగౌడ్‌, టీఆర్‌ఎస్‌ శ్రేణులు కేక్‌ కట్‌ చేసి ఘన ంగా నిర్వహించారు. వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ పోరెడ్డి శైలజారవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ కడియం స్వప్న, పలువురు సర్పంచ్‌లు జోగు సరోజిని పిచ్చిరెడ్డి, కుసుమ వెంకటమ్మ, వెన్న రవీందర్‌రెడ్డి, వీరస్వామి, జ్యోతిరామారావు, రామకృష్ణ, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు జోగు అరవిందరెడ్డి పాల్గొన్నారు. 

అనంతగిరి : అనంతగిరి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ నూతన కార్యాలయాన్ని టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు గింజుపల్లి రమేష్‌ ప్రారంభించి, కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు బొర్ర సుధారాణిపుల్లారెడ్డి, జడ్పీటీసీ ఉమ, మట్టపల్లి పుల్లయ్యగౌడ్‌, జొన్నలగడ్డ శ్రీను, సుంకర పుల్లారావు, గుగులోతు శ్రీను, వేనేపల్లి వెంకటేశ్వర్‌రావు, శ్రీనివా్‌సరెడ్డి, రంగారెడ్డి, చార్లెస్‌ పాల్గొన్నారు. అదేవిధంగా జడ్పీటీసీ కొణతం ఉమ మొక్కలు నాటి మాట్లాడారు. 

గరిడేపల్లి :  మండల కేంద్రంలో జరిగిన వేడుకల్లో సర్పంచ్‌ త్రిపురం సీతారాంరెడ్డి, ఎంపీటీసీ కడియం స్వప్నావెంకట్‌రెడ్డిలు పొనుగోడు రహదారిలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పీఆర్‌ ఏఈ సుధీర్‌, ఉపసర్పంచ్‌ సైదాబీ, కార్యదర్శి భద్రయ్య, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. 

కోదాడ రూరల్‌ : మండలంలోని కూచిపూడి  గ్రామంలో ఎంపీపీ కవితారాధారెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శెట్టి సురేష్‌, వార్డు సభ్యులు రాజేష్‌, రజిని, వసంతలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, మిర్యాల రామారావు, మెట్టు సైదులు పాల్గొన్నారు.

పెన్‌పహాడ్‌: మండల కేంద్రంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం మొక్కలను నాటారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ వావిళ్ల రమేష్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఊట్కూరి సైదులు పాల్గొన్నారు.

సూర్యాపేట సిటీ : సూర్యాపేట మార్కెట్‌ ఆవరణంలో జిల్లాపరిషత్‌ వైస్‌చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌తో కలిసి మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ ఉప్పల లలితాఆనంద్‌ మొక్కను నాటారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ కృష్ణారెడ్డి, కమిటీ మాజీ చైర్మన్‌ వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఫసియోద్ధిన్‌, చివ్వెంల వైస్‌ఎంపీపీ జూలకంటి జీవన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు

Updated Date - 2021-07-24T05:30:00+05:30 IST