నర్సరీలో పంపిణీకి సిద్ధంగా ఉన్న మొక్కలు

ABN , First Publish Date - 2021-06-21T06:33:00+05:30 IST

మండలంలోని హిమ్మతురావుపేటలో అట వీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ వన నర్సరీలో లక్షా 2వేల మొక్కలు పంపిణీకి సంబంధిత అధికారులు సిద్ధం చేశారు.

నర్సరీలో పంపిణీకి సిద్ధంగా ఉన్న మొక్కలు
పంపిణీకి సిద్దంగా ఉన్న మొక్కలు

కొడిమ్యాల, జూన్‌ 20 : మండలంలోని హిమ్మతురావుపేటలో అట వీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ వన నర్సరీలో లక్షా 2వేల మొక్కలు పంపిణీకి సంబంధిత అధికారులు సిద్ధం చేశారు. మండలం లోని హిమ్మతురావుపేట శివారులో 5 ఎకరాల స్థలంలో మండలంలో ప్ర తిపాదించిన అటవీ ప్రాంతాలలో నాటడానికి సుమారు 3లక్షల 50 వేల రూపాయల వ్యయంతో ఈ మొక్కలను సిద్ధం చేశారు. మొక్కల సంరక్ష ణకు ప్రతి రోజు ముగ్గురు వ్యక్తులు పని చేస్తున్నారు. ఆయుర్వేద ఔషదా లకు సంబంధించినవి 18వేలు, అటవీ పండ్ల మొక్కలు 7వేలు, అడవిలో పెంచే ఇతర మొక్కలు 27వేలు, గచ్చకాయలు 30వేలు, వెదురు 8వేలు మొక్కలు సిద్ధమైన ట్లు కొండగట్టు సెక్షన్‌ ఆఫీసర్‌ టి. శేఖర్‌ తెలిపారు. తి ర్మలాపూర్‌ బీట్‌లో 9వేల ఆయుర్వేద ఔషదాల మొక్కలు, కొడిమ్యాల అ టవీ ప్రాంతంలో వెదురు, గచ్చకాయల మొక్కలు 16వేల వరకు ప్రతి పాదనలు పూర్తి చేసినట్లు తెలిపారు. తిర్మాలాపూర్‌ గ్రామ శివారు దుబ్బ చిలుకలో అయిదు హెక్టార్‌ల భూమిలో ప్లాటేషన్‌కు సిద్ధం చేశామన్నారు.

Updated Date - 2021-06-21T06:33:00+05:30 IST