హరితహారానికి మొక్కలు సిద్ధం చేయాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-06-05T10:24:53+05:30 IST

హరితహారంలో భాగంగా నాటేందుకు మొక్కలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌ సూచించారు

హరితహారానికి మొక్కలు సిద్ధం చేయాలి : కలెక్టర్‌

వెల్దండ, జూన్‌ 4 : హరితహారంలో భాగంగా నాటేందుకు మొక్కలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌ సూచించారు. గురువారం ఆయన మండల కేంద్రంలో పర్యటించి డ్రెయినేజీ పనులను, వన నర్సరీని పరిశీలించారు. ఎన్ని మొక్కలు సిద్ధంగా ఉన్నాయి..? విత్తనాల మార్పిడి చేస్తున్నారా అని సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. అంధత్వంతో బాధపడుతున్న గిరిధర్‌రావు కుటుంబాన్ని కలెక్టర్‌ పరామర్శించారు. అదనపు కలెక్టర్‌ మనుచౌదరి, శిక్షణ కలెక్టర్‌ చిత్రామిశ్రా, డీపీఓ సురేశ్‌మోహన్‌, ఎంపీపీ విజయ, సర్పంచ్‌ భూపతిరెడ్డి, ఆర్డీఓ రాజేశ్‌కుమార్‌, ఏపీడీ గోవిందరాజులు, చారకొండ ఎంపీడీఓ జయసుధ, డీటీ వెంకటరమణ, ఎంపీవో సునీత తెలిపారు.


పల్లెప్రగతి పనుల తనిఖీ 

చారకొండ:  మండలంలోని శేరిఅప్పారెడ్డిపల్లి, చంద్రాయన్‌పల్లి గ్రామాల్లో జరుగుతున్న పల్లెప్రగతి పనులను గురువారం  కలెక్టర్‌ ఈ.శ్రీదర్‌, అదనపు కలెక్టర్‌ మనుచౌదరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో శ్మశానవాటిక, డంపింగ్‌ యార్డు, నర్సరీలను పరిశీలించి తగు సూచనలు చేశారు.  సర్పంచులు గోలి రంగారెడ్డి, వసంత, కల్వకుర్తి ఆర్డీవో రాజేష్‌కు మార్‌, తహసీల్దార్‌ నాగమణి, ఈజీఎస్‌ ఏపీవో గోవిందరాజులు, ఎంపీడీవో జయసుధ, ఎంపీవో నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-05T10:24:53+05:30 IST